Protein Rich Diet Plan Improves Strength Strong Bones

రోజు దీన్ని తాగితే కళ్ళు క్లియర్గా కనబడతాయి. ఎదుగుదల బాగుంటుంది

స్కూల్ కి వెళ్ళే పిల్లలకు అంటే  6 నుంచి 12 సంవత్సరాల పిల్లలకి 1800 క్యాలరీలు అవసరం అవుతుంది. పిల్లల బరువును బట్టి వాళ్ళకి  కేలరీల శక్తి అవసరం అవుతుంది. 25 గ్రాముల ఫ్యాట్ అవసరం అవుతుంది. కార్బోహైడ్రేట్స్ 150 నుండి 200 గ్రాములు అవసరమవుతాయి. రోజుకు 600 మిల్లీగ్రాముల కాల్షియం అవసరమవుతుంది. ఐరన్ ముప్పై మిల్లీగ్రాముల అవసరం పడుతుంది. విటమిన్ డి అయితే 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ ప్రతిరోజు అవసరమవుతాయి.

పిల్లలకు టేస్ట్ గా పెడుతున్నానా లేదా అనేదే చూస్తారు  తప్ప వారికి  కావలసిన అన్ని పోషకాలు అందుతున్నాయా  లేదా అనేది ఆలోచించట్లేదు. ఇప్పుడు  ఎక్కువగా 6 నుంచి 12 సంవత్సరాల మధ్య పిల్లలకి కళ్ళద్దాలు వస్తున్నాయి. రోజుకు 9 నుంచి 10 గంటల నిద్ర తప్పనిసరి గా ఉండాలి. నిద్ర తక్కువయిన పిల్లలు వీక్ అయిపోతారు. ఒత్తిడి పెరిగిపోతుంది. 6 నుంచి 12 సంవత్సరాల వయసు పిల్లలకు ఎక్కువగా ఎండ తగలాలి. ఎండ తగలకపోతే  విటమిన్ డి లోపించి  క్యాల్షియం ఎముకలకు పట్టదు. 

6 నుండి 12 సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు తప్పనిసరిగా విటమిన్-డి టెస్ట్ చేయించాలి. స్కూల్ కి వెళ్లేటప్పుడు రోడ్డుకు ఇరువైపులా ఉండే ఆహారాలు తినడం  వల్ల పిల్లలు తరచుగా జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటితో ఇబ్బంది పడతారు. దీని వల్ల   రక్షక వ్యవస్థ   క్షీణించి  ఎదుగుదల దెబ్బతింటుంది. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి.  ఉదయం లేవగానే  2 లేదా 3 గ్లాసుల నీళ్లు తాగించాలి. 

క్యారెట్, బీట్రూట్, టమాటా, కొత్తిమీర, మునగాకు వేసి  జ్యూస్ చేసి 150 -200 ml ఇవ్వాలి. బ్రేక్ ఫాస్ట్ కి రెండు లేదా మూడు రకాల స్ప్రౌట్స్,  కొంచెం కొబ్బరి తురుము, దానిమ్మ గింజలు, ఖర్జూరం ముక్కలు, ఒక చెంచా తేనె కలిపి ఇవ్వాలి. రోజు ఒక ఫ్రూట్ తప్పనిసరిగా ఇవ్వాలి.  ఇది తిని వెళ్లడం వల్ల పిల్లలు మార్నింగ్ టైమ్ అంతా చాలా యాక్టివ్గా ఉంటారు. మత్తు అనేది రాదు. స్ప్రౌట్స్ అలా తినలేక పోతే ఉడికించి లేదా తాలింపు పెట్టి కూడా పెట్టవచ్చు. శని ఆదివారాలు మిల్లెట్స్ లకు పాలిష్ పట్టిన రవ్వతో చేసిన బ్రేక్ఫాస్ట్ పెట్టాలి.

వాళ్లకి ఇష్టమైతే పాలు కూడా ఇవ్వవచ్చు.  రోజు మధ్యాహ్నం భోజనంలో పప్పు, ఆకుకూర, మిల్లెట్  రైస్ ఇవ్వాలి. నువ్వులు, బెల్లం కలిపిన ఉండ  ఇవ్వాలి. సాయంత్రం ఇంటికి రాగానే ఒక గ్లాసు జ్యూస్ ఇచ్చి ఒక గంట ఆడుకో నివ్వాలి. తర్వాత ఆరున్నర ఏడు గంటల లోపు ఒక కూరతో  అన్నం పెట్టాలి. ఇలా చేసినట్లయితే మానసిక పెరుగుదల, శారీరక పెరుగుదల బాగుంటుంది.  పిల్లలకు అవసరమైన పోషకాలు, కేలరీలు కూడా లభిస్తాయి.

Leave a Comment

error: Content is protected !!