ఫ్రూట్స్, నట్స్ తో హెల్దీ బర్ఫీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రూట్ నట్ బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు వేపించిన జీడిపప్పు పొడి వన్ కప్, గింజ తీసేసిన ఖర్జూరం వన్ కప్, పిస్తా పప్పులు పావు కప్పు, జీడిపప్పులు పావు కప్పు, బాదంపప్పు పావు కప్, కిస్మిస్ 2 పావు కప్, తేనే 2 టేబుల్స్, పాలు 2 టేబుల్ స్పూన్, ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలో బాదంపప్పులు వేసి ముక్క చెక్కల చేసుకోవాలి దానిలో జీడిపప్పులు, పిస్తా పప్పులు, కిస్మిస్, గింజ తీసేసిన ఖర్జూరం వేసి మిక్సీ పట్టుకుంటే ముక్క చెక్కలా ముద్దగా అవుతుంది. ఇప్పుడు బర్ఫీకి డ్రైనట్ పదార్థం సిద్ధమైంది. ఒక బౌల్ లో వేపించిన జీడిపప్పులు పొడిని తీసుకావాలి.
దానిలో తీపి కోసం కొద్దిగా తేనెను వేసి కొద్దిగా పాలు కూడా వేసుకుని చపాతి ముద్దలా కలుపుకోవాలి. దీనిని రెండు ఉండలుగా చేసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. ఒక చపాతీలో డ్రైనట్స్ తో చేసిన మిశ్రమాన్ని ఉంచి బాగా ప్రెస్ చేయాలి. దీని పైన మరొక చపాతిని పెట్టి చపాతి కర్రతో ఒత్తుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో బర్ఫీని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రూట్ నట్ బర్ఫీ సిద్ధమైంది. 100 గ్రాముల జీడిపప్పు లో ఉండే పోషకాలు 553 కేలరీల శక్తి ని కలిగి ఉంటుంది. ప్రోటీన్ 18.22 గ్రాములు, కొవ్వులు 43.85 గ్రాములు, కార్బోహైడ్రేట్ 30.19 గ్రాములు, ఫైబర్ 3.3 గ్రాములు, కాల్షియం 37 mg, లాభిస్తాయి.
100 గ్రాముల బాదం పప్పులు తీసుకుంటే పోషకాలు 571 కిలో క్యాలరీల శక్తి, ప్రొటీన్ 21.43 గ్రాములు, కార్బోహైడ్రేట్ 21.43 గ్రాములు, ఫైబర్ 10.7 గ్రాములు, కొవ్వు 50 గ్రాములు. ఈ డ్రై నట్స్ అనేవి బ్రెయిన్ డెవలప్మెంట్ కి, జ్ఞాపకశక్తి ఎక్కువ పెరగడానికి ఆల్జీమర్స్ రాకుండా ఉండడానికి, శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా చేయడానికి బాగా ఉపయోగపడతాయి.ఇవి రోగ నిరోధకశక్తిని పెంపొందించడమే కాకుండా. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది. నీరసంగా ఉన్నవాళ్లు ఖర్జూరం తింటే చాలు రోజంతా హాపీ గా ఉంటారు. కాబట్టి ప్రతిరోజు ఫ్రూట్ నట్ బర్ఫీ తినడం వల్ల ఎక్కువ ప్రోటీన్ అనేది లభిస్తుంది.
దీనిని చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా తినొచ్చు.