Protein Rich Herbal Shampoo At Home in Telugu

యూట్యూబ్ లో ఎవరు చెప్పని అద్భుతమైన హెర్బల్ హెయిర్ షాంపూ. మీ జుట్టు పెరగడం ఎవరు ఆపలేరు

కెమికల్ తో తయారుచేసిన షాంపూలు అయితే జిడ్డు తగ్గిస్తాయి కానీ అనేక జుట్టు సమస్యలకు కారణమవుతాయి. అందులో ఉండే కెమికల్ కుదుళ్లకు హాని చేసి హెయిర్ గ్రోత్ ని ఆపేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో తయారు చేసుకునే హోమ్ మేడ్ హెర్బల్ షాంపు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు కుంకుడు కాయ పొడి మూడు స్పూన్లు, తర్వాత పదార్థం శీకాయ పొడి ఒక స్పూన్ తీసుకోవాలి. కుంకుడుకాయ, శీకాకాయ పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో భాగంగా ఉపయోగించేవారు. ఇవి జుట్టులోని జిడ్డును తొలగించడమే కాకుండా అనేక జుట్టు సమస్యలను తగ్గిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి, కొత్త జుట్టు పెరిగేలా చేస్తాయి. 

తర్వాత పదార్థం ఉసిరికాయ. ఉసిరికాయ ఎండబెట్టిన ముక్కలు అందుబాటులో ఉంటే వాటిని వాడుకోవచ్చు. లేదంటే ఉసిరి పొడి కూడా అందుబాటులో ఉంటుంది. కనుక దానిని ఒక స్పూన్ లేదా ముక్కలు అయితే గుప్పెడు ఉపయోగించుకోవాలి. వాటితోపాటు రెక్క మందార పువ్వులను, వాటి ఆకులను కూడా తెచ్చుకోవాలి. వీటన్నింటిని ఒక గిన్నెలో వేసి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 

ఈ  గిన్నెను స్టవ్ మీద పెట్టి నీళ్లు ఒక గ్లాసు అయ్యేంత వరకు మరిగించాలి. మనం వదిలేసిన పదార్థాలలోని గుణాలు అంతా నీటిలోకి రావాలి. తర్వాత ఈ నీటిని చల్లార్చుకొని డబల్ ఫిల్టర్ చేసుకోవాలి. అంటే ఒక  పలుచటి క్లాత్ వేసుకొని దాని మీద పెట్టుకోవాలి. వడకట్టడం వల్ల పెద్ద ముక్కలు ఆగిపోతే కిందనున్న పలుచటి క్లాత్ వల్ల ఇందులో వేసిన పౌడర్లు నీటిలోకి దిగకుండా ఉండిపోతాయి. తర్వాత ఈ నీటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్ లో నిల్వ చేసుకోవచ్చు.

 దీనిని పది రోజుల వరకు ఫ్రిజ్లో పెట్టి నిల్వ చేయవచ్చు. తలకి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. తలకు పూర్తిగా నూనె అప్లై చేసుకుని కనీసం రెండు గంటలు ఉంచుకోవాలి. తర్వాత మీ షాంపూను తలకి మసాజ్ చేసుకొని కనీసం అరగంట తలపై ఉంచుకోవాలి. తర్వాత మిగిలిన షాంపూతో గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు మృదువుగా మందంగా పెరుగుతుంది. మీ జుట్టు రఫ్ హెయిర్ అయితే ఇంట్లో తయారుచేసిన కండిషనర్లు ఉపయోగించాలి.

Leave a Comment

error: Content is protected !!