స్మూతీస్ అందరూ మంచిగా ఆగిపోవాలని కారణం దానిలో వేసే ఫ్రూట్స్, నట్స్ కొన్ని వెజిటేబుల్స్ గాని పేరుకు మాత్రమే వాడి మిగతావన్నీ హాని కలిగించేవి వాడతారు. ఏమిటి అంటే బాగా ప్రెస్ చేసినా పాలు, ఐస్ ఎక్కువ వాడుతూ ఉంటారు. దీంతోపాటు ఎక్కువ పంచదార గాని ఆర్టిఫిషియల్ షుగర్స్ గానీ వాడుతూ ఉంటారు. దీనివల్ల 200ml స్మూతీ తీసుకుంటే 50 గ్రాములు షుగర్ వెళ్ళిపోతుంది. దీనితోపాటు కొన్ని ఫ్లేవర్స్ కలుపుతూ ఉంటారు. బాగుండడం కోసం ఐస్ క్రీమ్స్ కూడా కలుపుతూ ఉంటారు. ఎనర్జీని బాగా పెరగడం కోసం బాదంపప్పులు, జీడిపప్పులు, డ్రైనట్స్ కూడా కలుపుతూ ఉంటారు.
ఈ స్మూతీస్ తాగడం వల్ల చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. 100 గ్రాములు పంచదార 400 క్యాలరీల శక్తిని ఇస్తుంది. 250 స్మూతీ తీసుకున్న 50 గ్రాముల షుగర్ ఈజీగా వెళుతుంది. అంత షుగర్ ఒకేసారి లోపలికి వెళ్లడం వల్ల ఈ వైట్ షుగర్ అంతా యసిడిక్ నేచర్ కలిగే ఉంటుంది. దీనివల్ల ఎముకల్లో ఉండే కాల్షియమ్ తగ్గిపోయి ఎముకలు గుల్ల బారిపోతాయి. రక్తనాళాల లోపల ఉండే పోర ఈ యసిడిక్ వల్ల డామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయిన లేయర్ దగ్గర బ్యాడ్ కొలెస్ట్రాల్ వెళ్లి చేరుకుంటుంది. ఇది హార్ట్ పేరుకుపోతే హార్ట్ ఎటాక్ బ్రెయిన్ లో పేరుకుపోతే పక్షవాతం వస్తాయి. అసిడిక్ ఫుడ్ అయిన పంచదార లోపలికి చేరుకొని ఎక్కువ హాని చేస్తుంది.
దీనివల్ల డైజెస్టివ్ సిస్టం డ్యామేజ్ అవుతుంది. ఈ స్మూతీలో ఎక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్ ని ఆడ్ చేయడం వల్ల ఈ క్యాలరీస్ అన్ని బాడీ యూస్ చేయదు. అందుకని ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. దీనివల్ల ఎక్కువ బరువు పెరగడానికి కారణం అవుతుంది. డయాబెటిస్ ఎక్కువగా రావడానికి ఇది ఒక కారణం. ఫ్రూట్ జ్యూస్ తీసుకొవాలి అంటే దానికి పాలు కలపకూడదు, పంచదార వేయకూడదు, ఐస్ అసలు వేయకూడదు. ప్యూర్ ఫ్రూట్ జ్యూస్ లో తేనె కలుపుకొని కాఫీ తాగినట్టు తాగాలి. ఇలా తాగడం ద్వారా లాలాజలం కలిసి విటమిన్స్ అన్ని ఒంటికి పడతాయి. ఇలా తీసుకోవడం పోషకాలు అన్ని శరీరంలోనికి చేరి హెల్తీగా ఉంటారు.
ఈ స్మూతీస్ లో జీడిపప్పు బాదంపప్పు, కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటితోపాటు కొబ్బరి పాలు కూడా యాడ్ చేయడం చాలా మంచిది.