అందరికీ మినప్పప్పు వడలు, సెనగపప్పు వడలే కానీ స్ప్రౌట్స్ మరియు శనగలతో వడలు చేసుకోవచ్చు. ఇది హై ప్రోటీన్ డైట్ లాగా బాగా ఉపయోగపడుతుంది. వీటిని స్ప్రౌటింగ్ సెనగల వడలు అంటారు. ఈ వడలు ఈ రోజుల్లో డయాబెటిక్ ఉన్నవారికి, ఓబిసిటీ ఉన్నవారికి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఇడ్లీ, ఉప్మా, దోసె ఇవన్నీ ఈ సమస్యలన్నిటికీ కారణం. ఈ శనగల స్ప్రౌట్స్ లోను ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్ చాలా తక్కువ ఉంటాయి. శనగలు, స్ప్రౌట్స్ లోను ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా బ్లడ్ లోకి వెళ్ళి స్లోగా గ్లూకోస్ ని రిలీజ్ చేస్తాయి.
ఈ వడల వల్ల డయాబెటిక్ ఉన్న వాళ్ళకి బ్లడ్ లో షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది. కానీ ఈ వడలను నూనె లేకుండా నాన్ స్టిక్ పాన్ మీద గాని లేదా ఓవెన్ లోను పెట్టుకొని చేసుకోవాలి. స్ప్రౌటింగ్ సెనగల వడ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మొలకెత్తిన శనగలు ఒక కప్పు, క్యారెట్ తురుము పావు కప్పు, పాలక్ తురుము పావు కప్పు, కొబ్బరి తురుము పావు కప్పు, పెరుగు రెండు టేబుల్ స్పూన్లు, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్, నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్, జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మీగడ వన్ టేబుల్ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా ముందుగా ముందుగా మిక్సీ జార్ లో సెనగలు వేసి మిక్సీ పట్టుకోవాలి.
తరువాత కొద్దిగా పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని ఆ వడల పిండికి జీలకర్ర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ క్యారెట్ తురుము, పాలక్ తురుము కొబ్బరి తురుము కొత్తిమీర, నిమ్మరసం, చాట్ మసాలా మీగడ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి దాని మీద కొద్దిగా మీగడ రాసి వడలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలి. ఇలా పది పదిహేను నిమిషాలు బాగా కాల్చుకోవాలి. అప్పుడే వడలు బాగా ఉడికి రుచిగా ఉంటాయి. మామూలుగా నూనెలో దేవిన వడలు రెండు మూడు తింటే వెగటుగా అనిపిస్తుంది. కానీ వీటిని ఎనిమిది పది తిన్న ఇబ్బంది లేకుండా ఉంటుంది.