వేరుశనగపప్పు అంటేనే అతి బలమైన పప్పులు. సామాన్యుడి జీడిపప్పు. దీనిలో 25% ప్రోటీన్ ఉంటుంది. శరీరానికి మంచి పోషకాలను అందిస్తుంది. క్యారెట్ అంటే కంటికి కావలసిన కెరోటిన్ ఉంటుంది. ఇలాంటి కంటికి, ఒంటికి కావలసిన పోషకాలు అందించే ఈ రెండింటి కాంబినేషన్లో పీనట్ క్యారెట్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలి అంటే పీనట్ క్యారెట్ రోల్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. ముందుగా వేరుశనగ పప్పులను వన్ అండ్ ఆఫ్ కప్ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ తురుము వన్ కప్, తేనె వన్ కప్, బాదంపప్పులు వన్ టేబుల్ స్పూన్, ఓట్స్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, యాలకుల పొడి కొద్దిగా తీసుకోవాలి.
నాన్ స్టిక్ పాత్రలో కొద్దిగా మీగడ వేసి బాదంపప్పు ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత క్యారెట్ తురుము కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత తేనె వేసి బాదంపప్పు ముక్కలను, క్యారెట్ తురుమును బాగా ఉడకనివ్వాలి. ఈ క్యారెట్ తురుము ఉడికిన తర్వాత కొద్దిగా ఓట్స్ పౌడర్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తేనెతో ఉడికించిన క్యారెక్టర్ స్టఫింగ్ సిద్ధమైంది. దాని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరుశనగ గుళ్లను తీసుకొని తొక్క తీసేయాలి. తర్వాత వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని ఈ పౌడర్ ని దానిలో వేసి ఒక కప్పు తేనె పోసి వేయించుకోలి.
దీని యొక్క జిగురుకి వేరుశనగపప్పు పొడి ముద్దలా అవుతుంది. స్టఫింగ్ కోసం క్యారెట్ సిద్ధం చేసుకున్న దానిని రోల్ గా చేసి పక్కన పెట్టుకోవాలి. తేనెతో చేసిన వేరుశనగపప్పు ముద్దని అప్పడాల కర్రతో చపాతీలా ఒత్తుకోవాలి. దీనిని బట్టర్ పేపర్ మీద ఉంచి దానిపైన క్యారెట్ రోల్ ని ఉంచి మెల్లిగా చుట్టుకోవాలి. బట్టర్ పేపర్ జరుపుకుంటూ మెల్లిగా రోల్ చేసుకోవాలి. పీ నట్ క్యారెట్ రోల్ సిద్ధమవుతుంది. ఇలా ప్రెస్ చేయడం వల్ల అంటుకుపోయి బయటికి రాకుండా గట్టిగా పట్టుకుని ఉంటుంది. నీటిగా రోల్ చేసిన తర్వాత దాన్ని మనకు కావలసిన సైజుల్లో మొక్కల వలే కట్ చేసుకుని పైన పీనట్ పౌడర్, పిస్తా పప్పులతో డ్రెస్సింగ్ చేసుకోవాలి.
దీనిలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్లు దీనిని తక్కువ తినడం మంచిది. ఈ పోషకాలు ఉన్న స్వీట్ పిల్లలకు పెడితే చాలా మంచిది.