పుచ్చకాయ ఎండాకాలం వేడినుండి ఉపశమనం కలిగించేందుకు తింటుంటాం. వాటిలో ఉండే గింజలను చాలా వరకూ అందరూ ఊసేస్తూ ఉంటారు కానీ అందులో ఉండే పోషకాలు గురించి చాలామందికి తెలియదు. అతితక్కువ ఖర్చుతో ఈ గింజలతో కీళ్ళనొప్పులు, రక్తహీనత, కొవ్వు, అలసట అధిగమించొచ్చు. పుచ్చకాయ గింజలను మంచిగా ఎండబెట్టి తోలులేకుండా తినడం వలన నేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఒకప్పుడు వీటిని తోలు లేకుండా ఎండబెట్టడంకోసం చాలా కష్టపడేవారు. ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి. కేలరీలు తక్కువ పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ గింజల్లో మెగ్నీషియం, పొటాషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని, గుండెజబ్బులు తగ్గిస్తాయి. శరీరంలో చక్కెరస్థాయిల అదుపులో ఉంచుతాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి.
మెగ్నీషియం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఐరన్ సమృద్ధిగా ఉండడం వలన రక్తహీనత లేకుండా చేస్తుంది. మోనో అన్ సాచ్యురేటెడ్, పాలీ అన్సాచ్యురేట్ కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిని మంచికొవ్వులు అంటారు. ఇవి రక్తప్రసరణ మెరుగుపరిచి గుండెజబ్బులు దూరంగా ఉంచుతాయి. విటమిన్ సి కూడా ఉంటుంది. యాంటీ ఇన్ప్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలు వెడల్పుగా ఉండేలా చేస్తాయి. విటమిన్ బి కాంప్లెక్స్ ఉండడంవలన ఎముకలు బలంగా చేసి అలసట, నిస్సత్తువ దూరంచేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ప్రతిరోజూ తింటుంటే శరీరానికి కావలసిన పొటాషియం, మెగ్నీషియం, జింక్ అందుతాయి. దీనివలన ఎముకల సమస్యలు తగ్గుతాయి. మోకాళ్ళ నొప్పి, కీళ్ళనొప్పులు, నడుము నొప్పులు ఉన్నవారు రోజూ ఒకస్పూన్ గింజలు తీసుకోవడంవలన నొప్పులు తగ్గుతాయి. ప్రొటిన్ సమృద్ధిగా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉంచుతుంది. ఈ గింజలలో అమీనో ఆమ్లాలు, క్రిప్టోఫోన్, లైసిన్ , నియాసిన్ సమృద్ధిగా ఉంటుంది. నాడీవ్యవస్థ, జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి.చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఇందులో ఉండే విటమిన్ బి,ఫొలేట్, విటమిన్ బి6,థియామిన్, రిమోప్లోవిన్ అధికంగా ఉంటాయి. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అల్జీమర్స్ మెగ్నీషియం లోపంవలన వస్తుంది. యాబై సంవత్సరాలు దాటిన వాళ్ళు రోజూ ఈ గింజలు ఒక స్పూన్ తినడంవలన అల్జీమర్స్, డిమెన్షియా రావడానికి ఆస్కారం తక్కువ.
జింక్ వలన మెదడు సంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. జింక్ లోపంవలన జ్ఞాపకశక్తి తగ్గుతుంది. విటమిన్ బి 6 వలన మానసిక సమస్యలు తగ్గుతాయి. ఈ గింజలు శరీరంలో విటమిన్లు గ్రహించడాన్ని సహాయపడతాయి.ఆహారం బాగా జీర్ణం అవడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం, జింక్ వలన ఆహారం బాగా జీర్ణమవడంలో దోహదపడతాయి. మెగ్నీషియం వలన చర్మంపై తేమను కోల్పోకుండా చూస్తాయి. దురద, దద్దుర్లు రాకుండా చేస్తుంది. కణవిభజన వలన చర్మం ఆరోగ్యం గా వృద్దాప్య లక్షణాలు తగ్గిస్తూ ఉంటుంది. జుట్టు కుదుళ్ళను బలంగా చేసి జుట్టును ఆరోగ్యంగా, బలంగా చేస్తుంది.ఈ గింజలను వేయీంచి ఉప్పుకారం వేసుకుని తినవచ్చు. లేదంటే ఆహారం లో భాగం చేసుకోవచ్చు.