Pure Aloe vera Gel for beauty

100 % నేచురల్ అలోవెరా జెల్ ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి

చర్మ సంరక్షణ కోసం అలోవెరా జెల్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలా అలోవెరా జెల్ ఉపయోగించేటప్పుడు ఎక్కువ శాతం మంది తాజాగా తెచ్చిన కొమ్మల నుండి జెల్ సేకరించడం, చేసే విధానం  కష్టంగా ఉండి మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ కొనుక్కుంటారు. కలబంద మొక్క మనకు అందుబాటులో ఉంటే మనం కూడా మార్కెట్లో దొరికే అంత ఈజీగా ఒక్కసారి రెడీ చేసి పెట్టుకోవచ్చు. 

దీని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు ఎలా చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మనం నాలుగు అలోవేరా కొమ్మలు కట్ చేసి పెట్టుకోవాలి. వీటి నుండి పసుపు రంగు లిక్విడ్ బయటకి పోయేంతవరకు పక్కన పెట్టుకోవాలి.

 ఇది  చర్మానికి తాకినపుడు అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది  అందుకే ద్రావణం పోయిన తర్వాత ఈ కొమ్మలను శుభ్రంగా కడిగి ముళ్ళు ఉన్నటువంటి  సైడ్లు, పై తొక్క తీసేసి ఈ గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

 దీనిని మిక్సి జార్లో తీసుకోవాలి. మెత్తని పేస్ట్ లా చేసుకొని వడకట్టుకోవాలి. ఈ పేస్ట్ను స్టవ్పై పెట్టి రెండు మూడు నిమిషాలు మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు  పచ్చని లిక్విడ్ గిన్నె అంచులకు వస్తుంది. దీనిని తీసి బయట పోసుకోవాలి. 

ఇది బాగా మరిగిన తరువాత స్టవ్ ఆపేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమంలో  ఒక స్పూన్ జిలెటిన్ పౌడర్ వేసుకోవాలి. బాగా కలిపిన తరువాత నానబెట్టుకున్న అయిదారు కుంకుమ రేఖలను నీటితో సహా వేసుకోవాలి.

 ఇప్పుడు అలోవెరా జెల్ మంచి రంగు లోకి వస్తుంది దీనిలో రెండు స్టూన్ ల బాదం ఆయిల్, మూడు స్పూన్ల కొబ్బరి నూనె, 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో రెండు గంటలపాటు పెట్టుకోవాలి. ఇది మనకు మార్కెట్లో దొరికే కేసరి గంధ అలోవెరా జెల్లానే ఉంటుంది. దీనిని వాడి అనేక చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. మీరు మామూలు అలోవెరా జెల్ కావాలి అనుకుంటే కూడా కుంకుమ పువ్వు కలపకుండా చేసుకోవాలి.

అలొవెరా జెల్  వాడినపుడు శోథ నిరోధక లక్షణాలు నొప్పి, వాపు మరియు గాయాలు లేదా గాయాల వలన వచ్చే  నొప్పిని తగ్గిస్తాయి.

 ఇది కొల్లాజెన్ ఉత్పత్తి పెంచి మరియు యవ్వనాన్ని పెంచడంలో ముడతలు తగ్గుదలకు మద్దతు ఇస్తుంది.

 ఇది గాయం నయం చేసే సమయాన్ని వేగవంతం చేస్తుంది మరియు మచ్చలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. మరియు కాంతులీనే చర్మాన్ని అందించడంలో సహాయపడుతుంది.

 ఇది తేలికపాటి కాలిన గాయాల యొక్క చికిత్స మరియు మచ్చలు తగ్గడానికి  దోహదపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!