quick and easy homemade face packs for glowing skin

పండక్కి మూడు రోజుల ముందు ఎలా చేయండి, మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది

 పండుగ సమయంలో స్పెషల్ గా కనిపించాలని  అందరూ చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. పార్లర్కి వెళ్లే స్కిన్ బ్లోయింగ్ కోసం కలర్   ఇంప్రూవ్మెంట్ కోసం రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటారు.  కానీ మార్కెట్లో దొరికే రక రకాల ప్రొడక్ట్స్  ఉపయోగించడం వలన వాటిలో  ఉండే కెమికల్స్ చర్మానికి హాని కలిగిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉండే   వాటితో మీ ముఖాన్ని అందంగా,  కాంతివంతంగా తయారవుతుంది. దీనికోసం ముందుగా బొప్పాయి ముక్కలు తీసుకొని మెత్తగా పేస్ట్  చేసి పక్కన పెట్టుకోవాలి. 

      బొప్పాయి వద్దనుకున్న వాళ్ళు టమోటా, క్యారెట్, బీట్రూట్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. బొప్పాయి బదులుగా అరటిపండును కూడా తీసుకోవచ్చు కానీ  బొప్పాయి తీసుకోవడం వల్ల స్కిన్ క్లియర్ గా, గ్లో గా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని  ఒక చెంచా సెనగపిండి, ఒక చెంచా బియ్యప్పిండి, ఒక చెంచా కాఫీ పౌడర్,  ఒక  చెంచా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ లేకపోతే షుగర్ పౌడర్ వేసుకోవచ్చు. ముఖానికి వేసుకోవడానికి  వీలుగా ఉండే విధంగా సరిపడినంత బొప్పాయి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి అప్లై చేసుకొని 15 నిమిషాల పాటు ఉండనివ్వాలి. 

       తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖం బ్రైట్ గా కనిపిస్తుంది. తర్వాత స్కిన్ గ్లోయింగ్ కోసం ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకుని  ముల్తాని మట్టి, ఒక చెంచా  రోజ్ పౌడర్, ఒక ఆరంజ్ పౌడర్ వేసుకొని ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా బొప్పాయి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని  నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం గ్లో గా కనిపిస్తుంది. 

        అలాగే ఆరెంజ్ పీల్ పౌడర్ ను ఉపయోగించడం వల్ల స్కిన్  పింకిష్ కలర్ లో  బ్రైట్ గా, గ్లోగా కనిపిస్తుంది.  ఏదైనా పండగ లేదా ఫంక్షన్ ఉన్నప్పుడు మూడు రోజులు ముందు ఈ ప్యాక్ లలో ఏదో ఒకటి ట్రై చేసినట్లయితే ముఖం  అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. పార్లర్ కి వెళ్లి వేలకు  వేలు   ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే మీ ముఖం అందంగా తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్ లను ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

Leave a Comment

error: Content is protected !!