సుఖ విరోచనం అవకపోవడం అనేది మన రోజువారి జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మందుల ద్వారా సిరప్‌ల ద్వారా విరోచనం అయిన అది పూర్తిగా మలాన్ని శుభ్రం చెయ్యదు. ఇది కోలన్లో పేరుకొని తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తుంది. రోజంతా అస్తవ్యస్తంగా అనిపిస్తుంటుంది. ఈ సమస్య నుండి బయట పడడానికి రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తాగడం వల్ల విరోచనం సులభమవుతుంది. ఈ చలికాలంలో నీటిని తాగడం చాలా కష్టంగా భావిస్తాం. అలాగే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలు లేదా ముసలి వారిలో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. విరోచనం సులభంగా జరిగితే గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. ఈ సమస్య నుండి ఉపశమనం కోసం ఇంట్లో మనం చేయగలిగే రెమిడి ఎనిమ చేసుకోవడం.
ఎనిమా మలబద్ధకానికి చికిత్స చేయగలదు మరియు మీ ప్రేగులను క్లియర్ చేయగలదు. చాలా మంది వ్యక్తులు ఇతర ఉద్దేశించిన ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ఎనిమాను ఉపయోగిస్తారు . ఎనిమాలు బరువు తగ్గడానికి తోడ్పడతాయని, మీ శరీరం నుండి విషపదార్థాలు మరియు భారీ లోహాలను తొలగించి, మీ చర్మం, రోగనిరోధక శక్తి, రక్తపోటు మరియు శక్తి స్థాయిలను మెరుగుపరుస్తాయని కొందరు డాక్టర్లు పేర్కొన్నారు. ప్రతిరోజు ఇలా ఎనీమా చేసుకోవడం వలన మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి రిలీఫ్ లభిస్తుంది. ఎనిమా మిషన్‌కు ఉండే పైప్ ద్వారా మలద్వారం నుండి నీటిని లోపలకి పంపించాలి.
మనం నీటిని నోటిద్వారా తీసుకున్నప్పుడు అది కిందకి ప్రవహించి మలద్వారం ద్వారా బయటకు వస్తుంది. రివర్స్‌లో పంపినప్పుడు ఎక్కువ ప్రెషర్ తో అది తిరిగి బయటకు వచ్చేందుకు పంపబడుతుంది. దీనితో నీటిని లోపలికి పంపడం వలన గట్టిపడిన మలం మెత్తబడి బయటకు వస్తుంది. ఎనిమా ద్వారా పంపిన నీటిని ఐదు నిమిషాలపాటు ఆపుకొని తర్వాత మల విసర్జన చేస్తే ఈజీగా కడుపు శుభ్రం అవుతుంది. శరీరంలోని విష పదార్ధాలు ఎలా బయటకు వెళ్లి పోవడం వలన మన శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు చర్మ మెరుస్తుంది. జుట్టు బలంగా పెరుగుతుంది. రోజువారీ జీవితాన్ని ఉత్సాహంగా ఉండేందుకు సహకరిస్తుంది. అలాగే ఆహారంలో పొట్టుతీయని ఆహారాలు ఎక్కువగా తీసుకుంటూ పండ్ల రసాలు పచ్చి కూరగాయలు ఆహారంలో భాగం చేసుకొని నీటిని బాగా తాగడం వలన సులభంగా మలవిసర్జన జరుగుతుంది.