పండగల సీజన్ వచ్చేసింది మన ఇంటికి ఎవరొకరు వస్తూ ఉండటం, మనం ఎవరొకరి ఇంటికి వెళ్తుండటం జరుగుతుంది. ఆ సమయంలో ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ నగలు వేసుకున్నా ముఖంలో గ్లో లేకపోతే అసలు వేసుకున్నా అనవసరం అనిపిస్తాయి. మరి మనం అందంగా కనిపించాలంటే పార్లర్కి వెళ్లి ఫేసియల్స్ చేయించుకునే సమయం ఉండదు. అలాంటపుడు మనం ఈజీగా ఇంట్లోనే నాచురల్ ఇంగ్రేడియంట్స్ తో ఈ చిట్కాలను ట్రై చేసినట్లయితే మీరు నిముషాల్లో అందంగా కనిపించవచ్చు.
ఆ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా చిన్నవి రెండు బీట్రూట్ తీసుకోవాలి. వాటిని పీల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పీల్ చేసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ గ్రేటర్ సహాయంతో తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ముందు ఒక బీట్రూట్ తురుము తీసుకుని దాని నుండి జ్యూస్ వడకట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని రెండు చెంచాల బియ్యపిండి తీసుకోవాలి. దానిలో బీట్రూట్ జ్యూస్ వేసి కలుపుకోవాలి. తర్వాత దానిలో ఒక చెంచా తేనె కూడా వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవడానికి ముందు ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఈ మిశ్రమంతో ముఖం మొత్తం అప్లై చేసుకుని 5 నిముషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకోవడం వల్ల ముఖం పై ఉండే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. తర్వాత ముఖాన్ని చల్లని నీటితో కడిగేసుకోవాలి. తర్వాత ఉడికించిన అన్నం ముందుగా మనం పీల్చేసే పక్కన పెట్టుకున్న బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్ తో అర గ్లాసు పాలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లైతే ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. మీరు పార్లర్కి వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి ఫేసియల్ చేయించుకున్న రాని గ్లో ఈ ప్యాక్ వేసుకోవడం వలన వస్తుంది. సన్ టాన్ రిమూవ్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇది మీ చర్మం తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఇది అద్భుతమైన చిట్కా. ఈ చిట్కా మీరు కూడా ట్రై చేసి చూడండి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని అన్ని వయసుల వారు ఉపయోగించుకోవచ్చు.