వర్షాకాలం వచ్చేసింది. వర్షాలు పడినప్పుడు నుండి రకరకాల ఫ్లూ, జలుబు, జ్వరాలు, దగ్గు వంటి సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో ఇలాంటి జలుబు, జ్వరాలకు గురి కావడం అంత మంచిది కాదు. ఈ సమస్య ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. అలాంటప్పుడు పిల్లలకు, పెద్దలకు ఇంట్లో ఉండే సహజ పదార్థాల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గుకు దూరంగా ఉండటం చాలా అవసరం. దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు, దానితో చేయవలసిన నివారణ చిట్కా ఏంటో తెలుసుకుందాం.
దాని కోసం మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, తేనె, ఒక నిమ్మకాయ తీసుకోవాలి. ఒక గిన్నెలో ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. దానిలో అర స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఈ పొడిలన్నింటిలో రెండు స్పూన్ల తేనె వేసి కలపాలి. నిమ్మకాయను మధ్యలోకి కట్ చేసి అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత వీటిని అన్నింటినీ బాగా కలిపి పెద్దవారు అయితే అర స్పూన్, చిన్నపిల్లలకు అయితే పావు స్పూన్ ఉదయం సాయంత్రం తీసుకోవడం వలన జలుబు, దగ్గు సమస్య త్వరగా తగ్గిపోతుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పుష్కలంగా పెరుగుతుంది.
ఛాతిలో పేరుకున్న కఫాన్ని కరిగించి గెలుపు సమస్యలను నివారిస్తుంది. గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్, గొంతు సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది.
జీలకర్రలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా, జీలకర్ర విత్తనాలు జలుబు మరియు దగ్గుకు అద్భుతమైన ఇంటి నివారణ. జీలకర్రలోని సమ్మేళనాలు ఎర్రబడిన కండరాలను ఉపశమనం చేస్తాయి మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ధనియాలలో విటమిన్ సి మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి చలికాలంలో శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. జలుబు ప్రభావాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీరు ధనియాలను తినాలి, వాటిలో క్వెర్సెటిన్ (యాంటీ ఆక్సిడెంట్) ప్రయోజనాలను పొందవచ్చు. నల్ల మిరియాలు యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ బయాటిక్ స్వభావం కలిగి ఉంటాయి.
ఎందుకంటే ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఉంటుంది. నల్ల మిరియాలపొడిని చూర్ణం చేసి, వాటిని ఒక టీస్పూన్ తేనెలో కలపడం ద్వారా జలుబు నివారణకు దీనిని సాధారణంగా ఉపయోగిస్తారు. తేనె మరియు నిమ్మరసం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడుతాయి అలాగే కఫాన్ని కరీగించడంలో సహకరిస్తాయి.