Ramaa Raavi Health Benefits of Fenugreek Seeds

నెలరోజుల పాటు పరగడుపున మెంతి వాటర్ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు…… మీరు ట్రై చేసి చూడండి……

మెంతులు మన ఇంట్లో ఏదో ఒక విధంగా ఉపయోగిస్తూనే ఉంటాం. మెంతులు వలన కలిగే ప్రయోజనాలు గురించి ఈరోజు తెలుసుకుందాం. మెంతులు బాహ్యంగా గాని, లోపలికి కానీ తీసుకోవడం వలన చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మెంతులు గింజలు గాను లేదా ఆకు కూర గాను రెండు విధాలుగా మంచిది. విరోచనాలు అయ్యే వారికి పెరుగులో మెంతులను నానబెట్టి తినిపిస్తారు. అంతేకాకుండా రోజువారి ఆహారంలో మెంతులను ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తే ఒంటిలో వేడి తగ్గుతుంది.

                 మరియు ఇవి లీవర్ కు కూడా చాలా మంచిది. మరియు బాలింతలకు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. పాలిచ్చే తల్లులకు పాల ఉత్పత్తి పెంచడంలో మరియు గర్భకోశం సంకోచించడానికి మెంతులు బాగా ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల నీళ్ల విరోచనాలు తగ్గిపోతాయి. ఎందుకంటే వీటికి తడిని పీల్చుకునే గుణం ఉంటుంది. అందువలన వీటిని తాత్కాలిక వైద్యంగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా వీటిని చర్మ సౌందర్యానికి, జుట్టు సౌందర్యానికి ఉపయోగిస్తారు. అందువలన వీటిని ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు.

                మెంతులు రాత్రిపూట నానబెట్టి ఆ నీటిని ఉదయం తాగితే షుగర్, బీపీ కంట్రోల్ లో ఉంటుంది. బాడీలో ఉండే అతి వేడి లక్షణం దీంతో పోతుంది. ఇలా 15 రోజులు పాటు చేస్తే మీకు తేడా కనిపిస్తే మీరు తరువాత కూడా ఉపయోగించవచ్చు. మనం సాధారణంగా వీటిని పులుసులలో ఎక్కువగా ఉపయోగిస్తారు. చింతపండు పులుపు మెంతులు కాంబినేషన్ చాలా మంచిది. ఇలా ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న మెంతులు కూరల్లో ఉపయోగించి, పెద్ద మెంతులను పచ్చడిలో ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ప్రతి వారం మెంతికూరను తినాలి.

                   మెంతికూరను కూరల్లో, ప్రైస్ లో, పప్పులో వేసుకొని ఉపయోగించవచ్చు. అలాగే మెంతి పరోటా కూడా చేసుకోవచ్చు. ఇది రుచితో పాటు ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి. పిల్లలు ఈ విధంగా తినకపోతే మెంతులను పొడిచేసి కూరల్లో ఉపయోగించుకోవచ్చు. పెరుగన్నంలో కూడా మెంతులు పొడి కలుపుకొని తీసుకోవచ్చు. మరియు సలాడ్స్ లో కూడా ఉపయోగించవచ్చు. అలాగే సున్నిపిండి పట్టించేటప్పుడు అందులో కొన్ని మెంతులు కూడా ఉపయోగిస్తే మన చర్మం నున్నగా, మెరుస్తూ ఉంటుంది. మెంతులను పెరుగులో నానబెట్టి మిక్సీ పట్టి వాటిని తలకు పట్టించాలి.

               ఇలా చేయడం ద్వారా జుట్టు కుదుళ్ల నుంచి స్ట్రాంగ్ గా అవుతుంది. మరియు దురద చుండ్రు సమస్యల నుంచి విడుదల అందిస్తుంది……

Leave a Comment

error: Content is protected !!