Real Facts about Moringa Leaves Munaga Akulu

ఈ చెట్టు కాయలే కాదు ఆకు కూడా అదరహో అనిపించే ఫలితాలు ఇస్తుంది!!

మూరెడు కాయ, ముత్యమంత ఆకు. అందరికీ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయ్. మూరెడు కాయ అనగానే ఏదో ఒకలా  కచ్చితంగా మునక్కాయ అని చెప్పేస్తారు, చల్క్ మందికి కూడా మునక్కాయ అంటే మహా ఇష్టం. అయితే మునగాకు మహత్యం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ఆకుతో 300 వ్యాధులని దూరం చేసే సామర్థ్యం ఉంది అంటే మీరు నమ్ముతారా. నమ్మాలి తప్పదు. 

ఇంకా మునగాకులో దాగిన తెలుసుకుందాం. అద్భుతాలు ఒక్కసారి చూస్తే దిమ్మ తిరుగుతుంది.  కావాలంటే మీరే చూడండి. 

◆మునగాకులో ఎ, సి విటమిన్లు వున్నాయి. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు. ఇంకా చెప్పాలంటే పాస్పరస్ కు మునగాకు మూలం. ఇందులో రక్తవృద్ధికి ఉపయోగపడే ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.  

◆ ఆయుర్వేద మందుల తయారీలో 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. మునగాకుల్లో విటమిన్స్, అమైనో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే  వచ్చే విటమిన్ ఎ ని పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా మనం పొందొచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన ఔషధాల తయారీలో మునగాకును వాడతారు. 

◆పాల నుంచి లభించే క్యాల్షియంకు 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. సాధారణంగా పెరుగులో  మనకు ప్రోటీన్లు అధికంగా అందుతాయి, కానీ మునగాకును తీకుంటే పెరుగుకంటే ఎక్కువ ప్రోటీన్లు శరీరానికి అందించిన వాళ్ళం అవుతాము. 

◆మహిళలు రోజుకి  మూడు చిటికెల మునగాకు పొడిని వేడినీళ్లతో ఉదయం పూట 3 నెలల పాటు రెగ్యులర్‌గా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. థైరాయిడ్‌ సమస్య ఉన్నవాళ్ళతో రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ గా మునగాకు ఉపయోగపడుతుంది.

◆రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు క్రమబద్దీకరించడానికి ఇందులో ఉండే క్లోరోజేనిక్ యాసిడ్ దోహదం చేస్తుంది. అలాగే మునగాకుల రసాన్ని పాలలో కలపి పిల్లలకు తాగిస్తే వారి ఎముకలు దృఢంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎముకలు పెళుసుగా ఉన్నవారిలో ఈ చిట్కా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.

◆గర్భిణులు, బాలింతలకు మునగాకు ఆహారంగా ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు. పాలిచ్చే తల్లులకు మునగాకును పోపు గా చేసి వండి పెడితే పాలు పెరుగుతాయి. 

◆గుప్పెడు మునగాకులను గ్లాస్ నీటిలో వేసి ఐదు నిమిషాలు ఉడికించి అందులో తగినంత ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల ఉబ్బసం, దగ్గు వంటి వ్యాధులు తగ్గిపోతాయి. 

◆మునగాకు రసం ఒక స్పూన్ తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరేచనాలు తగ్గిపోతాయి. 

◆మునగాకు పేస్ట్ ను ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు మచ్చలు తగ్గి ముఖం కాంతివంతం అవుతుంది. 

చివరగా……

 మహిళలకు సంబంధించిన రుతు సంబంధమైన ఇబ్బందులకి కూడా మంచి మందు ఈ మునగాకు. కాల్షియన్ని భర్తీ చేయడం ద్వారా జుట్టు పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది. కబట్టి కాయలే కాదు ఆకు కూడా అదరహో అనేలా ఫలితాలు చేకూరుస్తుంది.

Leave a Comment

error: Content is protected !!