అనేక రకాల మందులు మింగినా తగ్గని మొండి వ్యాధులకు ఆయుర్వేదంలో అద్భుతమైన మందులు ఉన్నాయి. ఉమ్మెత్త చెట్లు మనందరికీ తెలిసినవే. తెల్లని పువ్వులతో ముళ్ళు ఉన్న కాయలతో ఉండే ఉమ్మెత్తని వినాయకుడి పూజలలో వాడుతుంటాం. కానీ ఉమ్మెత్తలో ఇంకో రకం ఉన్నాయి. నల్ల ఉమ్మెత్త అనే ఈ చెట్టు వంకాయ రంగు పూలతో ఉంటాయి. ఈ ఆకులను మోకాళ్ళ నొప్పి తగ్గడానికి వాడతారు. అంతేకాకుండా సెగగడ్డలు, వేడికురుపులు, స్త్రీలలో స్తనాల వాపులకు ఈ ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి నువ్వుల నూనె రాసి వేడి సెగ చూపించి గోరువెచ్చగా ఉన్నప్పుడు నొప్పి ఉన్నచోట కడితే నొప్పులు తగ్గుతాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
అలాగే తలనొప్పి వచ్చినప్పుడు నూనెరాసి నుదుటిపైన వేసుకుంటే తలనొప్పి తగ్గిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు ఈ ఆకులను కొవ్వు చేరినచోట కట్టుకుంటే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఈ చెట్టును వ్యాపార సంస్థలముందు పెంచితే ధనాకర్షణ జరిగి వ్యాపారం లాభాలబాట పట్టేలా చేసి వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఇంట్లో డబ్బు పెట్టేచోట ఈ ఆకులను పెట్టడంవలన ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించి ధనలాభం జరిగేలా చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో తగదాలు తగ్గి ప్రశాంతత ఆవరిస్తుంంది. ఎక్కువగా దిష్టి చేరే వ్యక్తులు మెడలో ఈ చెట్టు వేరుని తాయెత్తులా వేసుకుంటే దిష్టి తగలదు. అంత శక్తివంతమైనది ఈ చెట్టు.
అంతేకాకుండా పిచ్చికుక్క కాటుకు అద్భుతమైన మందు ఈ చెట్టు. ఆకులను తీసుకుని ముద్దలా చేసి కుక్క లేదా కోతి కరిచిన చోట రసంపోయాలి. దానివలన విషప్రభావం తగ్గుతుంది. ఎండిన నల్ల ఉమ్మెత్త ఆకుల పొగ పీలిస్తే ఆస్తమా తగ్గుముఖం పడుతుంది. మొలల సమస్యకు ఈ చెట్టు వేరు తీసుకుని మెత్తగా నూరి మొలలు ఉన్నచోట రాస్తే మొలలు రాలిపోతాయి. నల్ల ఉమ్మెత్త ఆకుల రసాన్ని అరికాళ్ళకు రాస్తే తిమ్మిర్లు, మంటలు తగ్గుతాయి. పేనుకొరుకుడు అంటే జుట్టు ఒకచోట మొత్తం ఊడిపోయి మళ్ళీ రాకపోవడం , మగవాళ్ళలో మీసం మధ్యలో, గడ్డం లో వెంట్రుకలు రాలిపోయి మళ్ళీ రాకపోవడం వలన అసహ్యంగా కనిపిస్తుంది.
నల్ల ఉమ్మెత్త ఆకుల రసం పెనుకొరికిన చోట రాస్తే వెంట్రుకలు మళ్ళీ మొలుస్తాయి. ఈ ఆకుల రసాన్ని గజ్జి, తామరలకు పైపూతగా రాస్తే త్వరగా తగ్గుతాయి. తలలో కురుపులకు ఆముదంలో ఈ ఆకుల రసాన్ని రాస్తే కురుపులు, నొప్పి తగ్గుతాయి. ఈ ఆకుల రసాన్ని నోటి లోపలకు తీసుకోకూడదు. ఎందుకంటే ఈ చెట్టు విషపూరితమైనది. అందుకే శరీరంపైన తప్ప లోపలకు వేసుకోరాదు. పిల్లలకు దూరంగా ఉంచడం మంచిది.
Vercoveens ki medicine cheppandi please