real facts about new fungus during pandamic

మరో ముప్పు రాబోతుంది. అన్నింటికంటే ప్రాణాంతకం

రోజుకో కొత్త రకం వైరస్ కోరలు చాస్తోంది. మనిషిని తన కబంధ హస్తాల్లో బందనిచేస్తోంది. అసలు ఏంటి ఈ ఫంగస్.ఎందుకు ఇన్ని ఫంగస్ల దాడి ఒకేసారి జరుగుతుంది. కొత్తగా ళీ బ్లాక్ ఫంగస్ ఏంటి దాని దాడి ఎలా మొదలైంది. మనం వివరంగా తెలుసుకుందాం. 2019 చివరలో మొదలైన ఈ వైరస్ దాడి ఇప్పటివరకు మారణహోమాన్ని సృష్టిస్తోంది. కొన్నిరోజులు ఎక్కడా కేసులు లేనట్టు, అసలు ఎక్కడ వైరస్ అనేది కనిపించకుండా పోయింది అనే నమ్మకాన్ని కలిగించి ఒక్కసారిగా మానవాళిపై తిరిగి దాడి చేయడం మొదలు పెట్టింది. రెండోసారి మొదలుపెట్టిన సెకండ్ వేవ్ వచ్చింది. వైరస్ సోకింది అని తెలిసే లోగానే ప్రాణాలను హరిస్తుంది. మనిషి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేంతవరకు ఈ వైరస్ వచ్చింది అన్న విషయం తెలియడం లేదు. అసలు ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. 

అంటే మనం ప్రకృతిని నాశనం చేసుకోవడం వల్లనే మన మీద తన కోపాన్ని ప్రకృతి తీర్చుకుంటుంది అంటున్నారు. చెట్లు కొట్టేయడం, వాతావరణ కాలుష్యం పెరిగి పోవడం వలన వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్ చాలా వరకు పడిపోయింది. ఇప్పుడు ఇదే ఈ వైరస్ కి ప్లస్ పాయింట్ గా మారింది. శరీరంలోని అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు మహమ్మారి విజృంభన మొదలుపెట్టింది. రోగనిరోధక శక్తి అధికంగా ఉండే భారతదేశంలో కూడా ఈ మహమ్మారి విజృంభన అధికం చేసింది. ఈ మహమ్మారి  ఏ వ్యక్తికి అయితే ఉందో ఆ వ్యక్తి తన ఉనికిని పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఒకసారి పూర్తయింది అని విశ్రాంతి తీసుకునే లోపు రెండోసారి తన తడాఖా చూపించడానికి సెకండ్‌వేవ్ రూపంలో వచ్చింది. 

మొదటి వేవ్‌లో  కనీసం 15 రోజుల పాటు లక్షణాలు బయట పడేందుకు సమయం ఇచ్చింది. కానీ ఈ సారి చాలా త్వరగా లక్షణాలు బయట పడడం అంతే త్వరగా పరిస్థితులు విషమించడం కూడా జరిగిపోతుంది. దానికి తోడు బ్లాక్ ఫంగస్ అనే మహమ్మారి తోడు అయింది. ఈ బ్లాక్ ఫంగస్ వలన కళ్ళు వాపులు రావడం, చెవిలో శబ్దం రావడం, ముక్కులోని నరాలు దెబ్బతినడం, చెడువాసన రావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. దీన్ని కూడా ఏదో మందులతో చికిత్స చేస్తున్నామని అనుకునేలోపు వైట్ ఫంగస్ అనే కొత్త వ్యాధి వచ్చింది. ఇది కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ల తో తన ప్రభావాన్ని చూపిస్తుంది. వైట్ ఫంగస్‌తో కూడా పోరాడుతున్నామనే సమయంలో ఎల్లో ఫంగస్ అని కొత్తది గుర్తించబడింది. ఒక్కొక్క ఫంగస్ ఒక్కొక్క శరీర అవయవాలపై తమ ప్రభావాన్ని చూపుతున్నాయి.

మనిషి ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్నాయి. ఇవన్నీ కొత్తగానే వచ్చాయా అంటే కాదు ఎప్పటినుండో మన చుట్టుపక్కల ఉన్నా ఇంతకుముందు మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి ఎదుర్కొనేద్వారా. చుట్టూ ఉన్న వాతావరణం కలుషితమై పోయి పరిస్థితులు రోగనిరోధక శక్తిని తగ్గించడంతో వైరల్ అవుతున్న ఈ ఫంగస్‌లు, వైరస్లు అందరి మీద దాడి చేస్తున్నాయి. అంటే మొదటిసారి వైరస్ సోకి బాధపడిన వారు ఇక తమ క్షేమం అనుకునేలోపు ఈ వైరస్లు దాడి చేస్తున్నాయి. అధిక శాతం, అధిక మోతాదులో స్టెరాయిడ్లు తీసుకోవడంతో ఆక్సిజన్ తయారీకి ఉపయోగించే నీరు స్టెరిలైజ్డ్ వాటర్ కాకుండా మామూలు నీళ్ళు ఉపయోగించడం కూడా జరిగిందట. నీటి నిల్వ చేసే పాత్రలు సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల అందులో చేరిన ఫంగస్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి తన ప్రభావాన్ని చూపడం మొదలు పెట్టింది. 

వీటన్నింటితో పాటు కొత్తగా ఇంకో ఫంగస్ బయటపడింది. అది గ్రీన్ ఫంగస్ మనుషులపై దాడి చేస్తే చాలా త్వరగా వారి ప్రాణాలను కోల్పోతారు అట. ఈ ఫంగస్‌ని మధ్యప్రదేశ్ జబల్పూర్లోని నేతాజీ వైద్య కళాశాలలో గుర్తించారట. కరోనా వైరస్ వ్యాపించిన వాళ్ళపై దాడిచేయడం వల్ల వారి గట్ బ్యాక్టీరియా నశించిందట. ఈ గ్రీన్ ఫంగస్ అనేది మన శరీరంలో మంచి బ్యాక్టీరియా నశించడం వల్ల శరీరంపై దాడి చేస్తుండటం మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా లో కూడా మంచి బ్యాక్టీరియా అనేది ఉంటుంది. వీటన్నిటినీ చేయాలంటే మన శరీరంలో రోగరోధక శక్తి బలంగా ఉండాలి.

అందుకే మన శరీరాన్ని ఎప్పటికప్పుడు బలంగా తయారు చేస్తూ ఉండాలి. దానికి తగ్గట్టు మంచి వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, సూర్యరశ్మి శరీరానికి తగ్గట్టు ఉండడం, వాకింగ్ చేయడం , బయటకు వెళ్ళినప్పుడు డబుల్ మాస్క్ ఉపయోగించడం, శానిటేషన్ చేసుకోవడం , సామాజిక దూరం పాటించడం,ఫేస్షీల్డ్వాడటం తప్పనిసరిగా చేయాలి. మనకు మనమే తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే  మన ప్రాణాలు రక్షించడంలో మనకు సహకరిస్తాయి

Leave a Comment

error: Content is protected !!