Real-health-benefits-of-potato

ఈ దుంపలో పోషకాలు తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది.

ప్రతి ఇంట్లో ఎక్కువగా కనిపించే దుంప కాయగూరల్లో బంగాళదుంప తప్పనిసరిగా ఉంటుంది. అయితే పెద్దలు దీన్ని ఎక్కువ తీసుకోవద్దు వాత సమస్యలు ఎక్కువ వస్తాయని చెబుతుంటారు. నిజంగానే బంగాళదుంప వల్ల సమస్యలు వస్తాయా. బంగాళదుంప ప్రయోజనాలు, లాభనష్టాలు మీకోసం.

◆ బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు, పీచు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ధయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బి6, విటమిన్-సి లభ్యమవుతాయి.  కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు ఉన్నాయి.  ఈవిధంగా చూస్తే బంగాళాదుంప అనేది మంచి పోషకాలు నింపుకున్న దుంప.

◆ అయితే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంతే కాదు దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అవయవాలు మరియు కండరాల భాగాల్లో సందుల్లో వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఇవే వాత నొప్పులుగా మారి ఇబ్బంది పెడతాయి. 

◆బంగాళా దుంపను  ఉడికించి తీసుకోవడం వల్ల చక్కని పలితం ఉంటుంది. నూనెలో ఫ్రై చేసే చిప్స్ ను అతిగా తీసుకుంటే బంగాళాదుంప నూనెను ఎక్కువ పీలుస్తుంది. దీనివల్ల మన శరీరంలోకి నూనెలు అతిగా వెళతాయి. దీనివల్ల ముఖం గా జిడ్డుగా మారడం, ముక్కు, గడ్డం వంటి ప్రాంతాల్లో నూనెతో కూడిన చీముగుల్లలు రావడం, మొటిమలు వంటివి ఎక్కువ రావడానికి ఆస్కారముంటుంది.

◆బంగాళాదుంపను వంటల్లో విరివిగా ఉపయోగిస్తారు ఇది అందరికీ తెల్సినదే ఇది ఎంత రువహిని ఇస్తుంది అంతే  బలవర్థకమైనది కూడా అయితే మితంగా తీసుకోవడం ఉత్తమం.

బంగాళదుంప బ్యూటీస్…..

బంగాళాదుంప బ్యూటీస్ ఏంటి అనుకోకండి. బంగాళాదుంపను ఆహారప్రయోజనంగానే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. బంగాళాదుంపను ఉపయోగించే చేసుకోదగ్గ అద్భుతమైన బ్యూటీ టిప్స్ మీకోసం.

◆కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఇబ్బందిపెడుతుంటే ప్రతిరోజు బంగాళదుంప రసంలో ముంచిన కాటన్ బాల్స్ ను కళ్ళ మీద పెట్టుకుని తీసేస్తుండలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా కళ్ళ చుట్టూ నల్లని వలయాలు తొలగిపోతాయి. అంతేకాదు ఈ చిట్కా వల్ల అలసిన కళ్ళు స్వాంతన పొందుతాయి కూడా.

◆బంగాళా దుంప రసాన్ని మొహానికి రాసుకుంటూ ఉంటే మొహం పైన ఏర్పడ్డ ముడుతలు తగ్గిపోయి చర్మం యవ్వనంగా కాంతివంతంగా తయారవుతుంది.  మరియు ముడుతలు రాకుండా చేస్తుంది.

◆ముఖం మీద మృతకణాలు, మచ్చలు వంటివి పోవాలంటే బంగాళదుంప రసంలోకి కొద్దిగా ముల్తానీ మట్టి వేసి సీఎం లా చేసి దాన్ని ఫేస్ పాక్  వేసుకొని పది నిమిషాల తరువాత కడిగెయ్యాలి ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా నూ క్లియర్ గానూ తయారవుతుంది 

◆పొడి చర్మం ఉన్నవారు బంగాళదుంప గుజ్జును కొద్దిగా పెరుగు జోడించి ముఖానికి రాసుకుంటూ వుంటే చర్మంగా మృదువుగా తయారవుతుంది.

చివరగా….

పైన చెప్పుకున్న చిట్కాలు కాకుండా వంటింట్లో బంగాళదుంప తో ఎన్నో ప్రయోగాలు చేయవచ్చు. ఉడికించిన బంగాళదుంప నెలల పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా చక్కగా తినేయచ్చు. ఇన్ని విషయాలు తెలిసాక దీని దుంప తెగ ఎన్ని పోషకాలు రా బాబు అనిపిస్తుంది కదా. 

Leave a Comment

error: Content is protected !!