real health benefits of soaked almonds

నానబెట్టిన బాదంలో నిజాగానే ప్రయోజనాలు ఉన్నాయా…..

కప్పుడు బాదం, గ్లాసుడు పాలు కలిస్తే హార్లిక్స్, గుప్పెడు బాదం గుండెలు ఎంతో ఆరోగ్యం. ఇలాంటివి రోజు చూస్తూనే ఉన్నాం. నిజంగా బాదం పప్పు రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మన సొంతమవుతుంద?? చిన్నప్పుడు బాదం కాయలు ఏరుకుని వాటిని పగలగొట్టి అందులో పప్పును తింటుంటే అదొక  అనిర్వచనీయమైన అనుభూతి. ఇపుడు బాదం ను తింటే తప్పంటారా?? బాదం తినడం వల్ల ప్రయోజనాలు ఏంటి?? అసలు బాదం వేటికి మేలు చేస్తుంది ఒక్కసారి చూద్దాం రండి.

బాదం ను రోజు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట తినడం ఇపుడు చాలా సాధారణం అయిపోయింది. 

బాదం లో ఏముంది??

బాదం ను దాదాపు ఎనిమిదిగంటలు నానబెట్టడం వల్ల అందులో ఒమేగా-3, విటమిన్-ఇ, ప్రోటీన్, పీచు మొదలైనవి సమృద్ధిగా అక్టీవ్ అవుతాయి. 

బాదం తినడం వల్ల ఉపయోగాలు

రోజు రాత్రిపూట బాదం ను నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల బరువు తగ్గడం ఎంతో సులువు అంటున్నాయి ప్రస్తుతం పాటిస్తున్న వారి అనుభవాలు. బాదం లో ప్రోటీన్ వల్ల ఆకలి తొందరగా వేయదు. అందుకే అధికంగా ఆహారం తీసుకోవడం తగ్గి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

రక్తపోటు

బాధం తినడం వల్ల శరీరం లో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అందుకే బాదం ను రక్తపోటు ఉన్నవాళ్లు కూడా నిస్సందేహంగా తినవచ్చు.

గుండె ఆరోగ్యం

గుండె ఆరోగ్యం గా ఉండాలంటే గుండెకు మంచి చేసే కొవ్వులను అందిస్తూ, చెడు కొవ్వులు నిర్మూలించాలి. బాదం తినడం వల్ల మంచి కొవ్వులు పెరిగి గుండెకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. రక్త ప్రసరణను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

ఎముకల బలానికి

రోజి రాత్రి నానబెట్టిన బాదం ను ఉదయాన్నే తీసుకోవడం వల్ల  బాదం లో మెగ్నీషియం, మరియు కాల్షియం వల్ల ఎముకలు బలం గా తయారవుతాయి.

వయసు ను తగ్గిస్తుంది

వయసు తగ్గించడం ఏమిటి అనుకోకండి. బాదం ను రాత్రి నానబెట్టి ఉదయం తినడం వల్ల అందులో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి తద్వారా చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. అంటే వయసు పెరిగినా యవ్వనంగా కనబడతామన్నమాట.

కాన్సర్ ను దూరంగా…..

బాధంలో ఉన్న బి17  విటమిన్ శరీరంలో కాన్సర్ ను కలుగజేసే కణాలతో పోరాడి యాంటీ కాన్సర్  కారకంగా పనిచేస్తుంది. ఫలితంగా  క్యాన్సర్ ను మన దరిదాపుల్లోకి కూడా రానివ్వదు.

గర్భవతులకు

గర్భవతులకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ నానబెట్టిన బాదం లో పుష్కలంగా ఉంటుంది. అందుకే గర్భవతులు ప్రతిరోజు నానబెట్టిన బాదం తినడం వల్ల ఫోలిక్ యాసిడ్ సరిపడు మోతాదులో అందుతూ తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు

చివరగా……

బాదం ను స్వీట్స్ లో, వేయించి, పాయసాల్లో, బాదం మిల్క్ రూపం లో ఇలా ఎన్ని రకాలుగా తీసుకున్నా, రాత్రి నానబెట్టి ఉదయం తినడం వల్ల రెండు రెట్ల పోషకాలను పొందగలుగుతారు.  అయితే బాదం పైన పొట్టు బాదం ద్వారా వచ్చి పోషకాలను గ్రహించకుండా చేస్తుంది కాబట్టి పొట్టును తొలగించి బాదం ను ప్రతిరోజు కనీసం 4 లేదా 5 తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

1 thought on “నానబెట్టిన బాదంలో నిజాగానే ప్రయోజనాలు ఉన్నాయా…..”

Leave a Comment

error: Content is protected !!