Reasons Behind Washing Legs Before Taking Food

భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలో తెలుసా??

పెద్ధోళ్ళు తెలివి లేనివారు కాదండీ మంచిని మంచిగా ఎపుడో చెప్పారు. నిజమే కదా ఇప్పటి తరానికి అర్థం కాదండీ అందుకే ఒకసారి విషయాన్ని చదివేయండి. 

నేరుగా అలా లోపలికి వస్తున్నారు కాళ్ళు కడుక్కుని రావడం నేర్పలేదేమిటి అని, రాగానే సింక్ దగ్గరకెళ్లి చేతులు మాత్రం కడుక్కుని వచేస్తున్నారు కాళ్ళు కడుక్కోకుండా ఇలా రావచ్చా భోజనం చేయడానికి అంటూ పెద్దోళ్ళ అరుపులు అపుడపుడు వినబడుతూనే ఉంటాయి. అయితే మారుతున్న కాలంతో డైనింగ్ టేబుల్స్ దగ్గర కూర్చుని తినేదానికి కాళ్ళు కడుక్కోవాలా?? అని కొందరు చిర్రుబుర్రులాడతారు. 

కరోనా పుణ్యమా అని కాళ్ళు చేతులు ఒకటికి పది సార్లు కడుక్కోవడం అలవాటు అయింది, అది కూడా శానిటైజర్లు, హాండ్ వాష్ లతో. అసలు  ఇప్పుడంటే హాండ్ వాష్ లు శానిటైజర్లు ఉన్నాయ్ మరి ఒకప్పుడు అవన్నీ లేవు కానీ అందరూ ఆరోగ్యంగా ఉన్నారుగా. 

బయటకు వెళ్లి బాగా తిరిగి వస్తే కేవలం చేతులు కడుక్కుని బోజనం ముందు కూర్చోవడం ఎంతమాత్రం పద్దతి కాదని పెద్దలు చెబుతారు మనం వాటిని చాదస్తంగా కొట్టి పడేస్తాం కానీ వాళ్ళు చెప్పే దాంట్లో 100%  మంచే తప్ప చాదస్తం లేదనే విషయం మనకు అర్థం కాదు. వాహనాల పొగ, కాలుష్యం, ఇంకా బయటకు వెళ్ళినపుడు ఎక్కడైనా కాలకృత్యాలు తీర్చుకోవడం వంటివి ఎన్నో చేస్తుంటాం. ఇన్ని పనులు చేశాక కేవలం చేతులు కడుక్కుని భోజనం చేయడం వల్ల ఎన్నో వైరస్ లు మనతో వచ్చేస్తుంటాయ్. 

మనం నడిచేది కాళ్ళతోనే కదా, మనం మనుషులం కదా మనం కాళ్ళు కడుక్కోకుండా భోజనానికి కూర్చున్నప్పుడు అప్పటిదాకా వేసుకున్న షూస్ లోపల మన కాళ్ళను బంధించిన సాక్స్ లు  చెమటతో నిండిపోయి దుర్వాసన వస్తూ అవి  బాక్టీరియా, వైరస్ లకు ఆవసాలుగా ఉంటుంది. పొరపాటున అవి వాటి ప్రభావం వల్ల మనం తినే ఆహారాన్ని అవరించుకుంటే, ఆ ఆహారం మనం తింటే దానివల్ల మన శరీరం చాలా తొందరగా జబ్బులకు లోనవుతుంది. 

అంతేకాదు వేగవంతమవుతున్న ప్రపంచంలో విజృంభిస్తున్న రోగాల నుండి మొదట మన జాగ్రత్తలే మనల్ని కాపాడతాయి అనే విషయం మనం మరువకూడదు.  భోజనానికి ముందు కాళ్ళు, చేతులు కడుక్కోవడం, తినే పాత్రను, లేక విస్తరను  లేక ఆకును నీటితో శుభ్రపరుచుకోవడం వల్ల తినే పాత్ర ఏదైనా అప్పటిదాకా అందులో ఉన్న దుమ్ము ధూళి రూపంలో ఉన్న బాక్టీరియా ను తొలగించడమే. 

మరొక ముఖ్య విషయం అనాది కాలం నుండి ఇప్పటిలాగా చలువరాతి బండలు, గ్రానైట్ బండలు అంటూ వేసి ఇంటిని కట్టేవారు కాదు. ఒకప్పుడు అంతా నేల, దానికి పేడ, ఎర్రమన్ను తో నేల అలికి అందమైన ముగ్గులు పెట్టేవారు. ఆనాటి కాలంలోనే కాళ్ళు కడుక్కొనిది భోజనం కాదు కదా కనీసం ఇంట్లోకి కూడా రానిచ్చేవారు కాదు. పేడలో ఉన్న ఔషధ శక్తి మనకు తెల్సినదే అయినా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు ఒకప్పుడు. కానీ ఇపుడు మాత్రం చలువ రాతి బండలతో నిర్మించుకున్న ఇళ్లలో సులువుగా బాక్టీరియా, వైరస్ చలించగలదు మరియు విస్తరించగలదు అందుకే కాళ్ళు కడుక్కుని భోజనానికి కూర్చోవడం చాలా మంచిది. 

చివరగా…

కాళ్ళు కడుక్కోకుండా భోజనానికి కూర్చోవడం వల్ల మనం ఏదైనా పరిశుభ్రత లేని ప్రాంతాల్లో తిరగాడి ఏవైనా తొక్కినట్టైతే ఆ వాసన భోజనం సమయంలో ఇబ్బంది కరంగా ఉండటమే కాక, జబ్బులను తెచ్చిపెడుతుంది. 

1 thought on “భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలో తెలుసా??”

Leave a Comment

error: Content is protected !!