Reasons For Puneeth Rajkumar Heart Attack cardiac arrest

పునీత్ రాజ్కుమార్ హార్ట్ ఎటాక్// ఫిట్ గా ఉండేవారు చేసే మిస్టేక్

ఈ మధ్యకాలంలో 25, 26 వయస్సులోనే హార్ట్ ఎటాక్ తో చనిపోయే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఒకప్పటి కాలంలో 46, 50 సంవత్సరాలకు హార్ట్ ఎటాక్ వస్తే చిన్నవయసులో వచ్చినట్లు భావించేవారు. మారిపోతున్న జీవనశైలి,  మన అనారోగ్యపు ఆహారపు అలవాట్లు, విపరీతమైన వ్యాయామం గుండెపోటుకు కారణం అవుతున్నాయి. అధికంగా వ్యాయామం చేసేవారు ఆహారం ఎక్కువగా తీసుకోవాలి అని నూనెలో వేయించినవి, మాంసాహారం, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకుంటారు. వారి శరీరం బయట నుండి చూస్తే చాలా దృఢంగా ఆరు పలకల దేహంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే లోపలికి తీసుకునే ఆహారం మీద వారి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

 మనం తినే ఆహారంలో మైదా, రైస్, పంచదార వంటి తెల్లటి ఆహారాలు ఎక్కువగా తీసుకుంటున్నాం. బేకరీ ఐటమ్స్, కేకులు వంటివి బాగా అలవాటైంది. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెంచి రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడే దానికి కారణం అవుతున్నాయి. హార్ట్ ఎటాక్ వచ్చిన తరువాత ఇటువంటి బ్లాకేజ్ లను గుర్తించి చికిత్స చేయడం వలన వారికి మరణప్రమాదం తగ్గవచ్చు. కానీ కొంతమందిలో మొదటి సారి హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు మరణం సంభవించవచ్చు. అందుకే కనీసం 25, 26 సంవత్సరాల వయసులో ఉన్నవారు యాంజియోగ్రామ్ టెస్ట్ చేయించుకోవడం వలన రక్తనాళాలలో బ్లాక్స్ గురించి జాగ్రత్త పడవచ్చు.

 కన్నడ హీరో పునీత్ రాజ్కుమార్ ఎంతో ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవుతూ, వ్యాయామాలు చేస్తూ ఉండేవారు. కానీ ఆయన హార్ట్ ఎటాక్ తో మరణించినప్పటి నుండి వ్యాయామాలపై చర్చ మొదలైంది. వ్యాయామాలు అధికంగా చేయడం వలన, శరీరం పరిమితికి మించి కష్ట పడటం వలన కార్డియాక్ అరెస్ట్ జరిగే అవకాశం ఉంది. పరిమితిని మించి వ్యాయామం చేయడం మంచిది కాదు. మెత్తంగా వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన పోషక ఆహారాన్ని తీసుకుంటూ ప్రతి ఒక్కరూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలి. 

అలాంటి జీవితం గడపాలి అంటే చిన్నతనం నుండి  మంచి ఆహారపుటలవాట్లు పెద్దలు అలవాటు చేయాలి. జంక్ ఫుడ్, మసాలాలు, స్వీట్లు, ఉప్పు కారాలు అధికంగా ఉండే ఆహారాలను తగ్గించి పచ్చి కూరగాయలు, పండ్లు, అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు ఆహారంలో ఉండేలా అన్నం తక్కువ కూర ఎక్కువగా తినడం అలవాటు చేయడంతో వారి శరీరం దృఢంగా ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!