రెడ్డివారి నానుబాలు ఏంటి ఈ పేరు ఎప్పుడైనా విన్నారా. లేకపోతే ఇప్పుడే తెలుసుకోండి. ఇంటముందు, పొలాల్లో , గోడలపై, నీరు ఎక్కువగా ఉండేచోట, గట్లపైన కనిపించే ఈ మొక్క కలుపు మొక్కగా భావించి పీకేస్తూ ఉంటాం. ఈ మొక్క కంటిదృష్టిని పెంచడంలోనూ, సంతాన సామర్థ్యాన్ని పెంచడంలోనూ, స్త్రీ పురుషులకు యవ్వన శక్తిని, శరీరంలో కణుతులను గడ్డలను కరిగించే అద్బుతమైన మొక్క వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మొక్కను సంస్కృతంలౌ దుత్తిక, హిందీలో దూత్తి అని, తెలుగులో రెడ్డి వారి నానుబాలు, పాలకాడ, గొర్రెకాడ, పచ్చబొట్లాకు అని పిలుస్తారు.
ఈ మొక్క ఎరుపు, తెలుపు రెండు రంగుల్లో ఉంటుంది. పెద్దగా అడుగువరకూ పెరిగే పెద్దరెడ్డివారి నానుబాలు కన్నా చిన్నగా పెరిగే మొక్కల్లో అద్బుతమైన ఔషధగుణాలు అధికం. ఈ ఆకులను దంచి తీసిన రసంతో పూర్వకాలంలో పచ్చబొట్లు వేసేవారట. ఈ మొక్క రుచి తీపిగా,కారంవగరుగా ఉంటుంది. ఈ ఆకుల రసం లేదా ఆకుల కషాయాన్ని మోతాదుకు తగ్గట్టు తీసుకుంటే శరీరంలో మేహ రోగాలు, కఫ రోగాలు, ప్రేగులలో పుట్టే క్రిమి రోగాలు, కంఠ రోగాలు, నేత్ర రోగాలు, చర్మ, సెగరోగాలను సమూలంగా నిర్మూలిస్తుంది.
ఈ ఆకును పప్పు లో వేసుకుని తింటే బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. డయాబెటిస్ వలన వచ్చే నేత్లమర నరాల వ్యాధులకు అద్బుతమైన మందు ఈ మొక్క. ఈ మొక్కను తెచ్చి ఎండబెట్టుకుని పొడిచేసుకోవాలి. ఈ పొడిని జల్లించి గాజుసీసాలో నిల్వచేయాలి. ఈ పొడిని రోజూ భోజనానికి అరగంట ముందు అరగ్లాసు వేడినీటిలో కలిపి తీసుకోవాలి. దీనివలన మధుమేహం అదుపులోకి వస్తుంది. కంటిచూపు మెరుగవుతుంది. వీర్యదోషం తొలగి సంతానభాగ్యం కలుగుతుంది. శరీరంలో కణుతులు గడ్డలు ఏర్పడినప్పుడు ఈ చెట్టు పాలను పిండి రుద్దితే కణంతులు గడ్డలు కరిగిపోతాయి.
కంటిసమస్యలు ఉన్నప్పుడు ఈ మొక్క చిన్నరెడ్డివారి నానుబాలు మొక్కను తుంపి ఆ పాలను కంట్లో ఒక చుక్క వేయడం వలన కంటిదృష్టిని మెరుగుపరుస్తుంది. వేడిశరీరం ఉన్నవారు రెండు రౌజులకు ఒకసారి మాత్రమే ఈ పాలను వాడాలి. ఒక ఇరవై రోజులు ఇలా వాడి తర్వాత మళ్ళీ పది రోజులు. వదిలేసి మరో ఇరవై రోజులు వాడడంవలన మంచిఫలితం ఉంటుంది. దీనివలన కంటి మసకలు, పుసుకులు, కంటి కురుపులు అన్నీ తగ్గిపోతాయి. ఆడవారిలో చాలా మంది పొత్తికడుపులో నొప్పికి గురవుతుంటారు. వీరు ఈ ఆకులు తెచ్చి దంచి పలుచటి వస్త్రంలో వడకట్టి ఈ రసాన్ని మూడుచెంచాల మోతాదులో తీసుకుంటె కడుపు నొప్పి తగ్గుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ మొక్క గురించి ఈ లింక్ లో మరింత తెలుసుకోండి.