reduce the risk of stroke and heart disease

ప్రతి ఒక్క వ్యక్తి ఎప్పుడో ఒకసారి అయినా దీన్ని తినాలి….. కివి వలన కలిగే ప్రయోజనాలు……

కివి ఫ్రూట్స్ ఈ మధ్యకాలంలో అందరికీ అన్ని చోట్ల చాలా సులువుగా లభిస్తున్నాయి. ఈ కివి ఫ్రూట్స్ ను ఉదయం రెండు, సాయంత్రం రెండు రోజు కనుక తీసుకుంటే మన శరీరంలో ఉండే కొవ్వు రక్తంలో తగ్గడానికి అవకాశం ఉంది. కొవ్వు కణాల్లో కొవ్వు నిల్వ ఉండకుండా చేసి గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుదల నియంత్రించడానికి ఉపయోగపడుతుంది అని 43 మంది మీద రోజు కివి ఫ్రూట్ తినిపించి నిరూపించారు. 2019లో తైపీ మెడికల్ యూనివర్సిటీ థైవాన్ వారు కివి ఫ్రూట్ యొక్క ఉపయోగాలు గురించి చెప్పడం జరిగింది.

                        కివి ఫ్రూట్స్ తినడం వలన గుడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుందని రెండు పూటలా ఇప్పుడు తినడం వలన అని వీరు చెప్పారు. ఈ రకమైన బెనిఫిట్స్ రావడానికి కారణం కివి ఫ్రూట్ లో ఉండే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. ముఖ్యంగా విటమిన్ ఇ, విటమిన్ సి ఈ రెండిటి కాంబినేషన్ చాలా ఎక్కువగా ఉండటం వలన ఈ కివి ఫ్రూట్ తిన్న తర్వాత అది లోపలికి వెళ్లి సి.ఈ.డిపి అనే జిన్ ను మార్పు చేసి రెండు యాంటీ ఆక్సిడెంట్ ఎలాంటి లాభాలు కలిగిస్తున్నాయి అంటే తీసుకున్న ఆహార పదార్థాలు ఎక్కువైనప్పుడు కొవ్వుగా మారిపోతాయి.

                      ఈ కొవ్వు అంత వెళ్లి కొవ్వు కణాల్లో పేరుకు పోతుంది. ఈ కొవ్వు కణాల్లో ఈ రెండు యాంటీ 

ఆక్సిడెంట్ సీఈడీపీ అనే జిన్ ను కొవ్వు కణాల్లో మార్పు తీసుకువచ్చి కొవ్వు కణాల్లో కొవ్వు నిల్వ ఉండకుండా ఈ జీన్ మాడిఫికేషన్ వలన జరుగుతుంది. ఈ కివి ఫ్రూట్స్ తినడం వలన సి.ఈ.డిపి కొవ్వు పేరుకు పోకుండా చేస్తుంది. తద్వారా ఏమవుతుంది అంటే లోపల హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ అని గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎల్ డి ఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రై గ్లీజరిన్స్ బ్లడ్ లో బాగా తగ్గుతున్నాయి.

                        కాబట్టి దీర్ఘకాలికంగా ఒక ఏడు, ఎనిమిది వారాలు ధాటీ అక్కడ నుంచి కివి రోజు తీసుకోవడం వలన అక్కడి నుంచి కూడా ఫలితాలు బాగా కనబడుతున్నాయని క్లియర్ గా వీళ్ళ పరిశోధనలు ఇవ్వడం జరిగింది. అందువలన గుండె జబ్బులు, హై బీపీ లు, ప్రాణాంతక సమస్యలైన రక్త సంబంధ సమస్యలు రాకూడదు అంటే రెగ్యులర్ గా అవకాశం ఉన్నంత వరకు రోజుకు రెండుసార్లు రెండు చోప్పున తీసుకోవడం చాలా మంచిది…

Leave a Comment

error: Content is protected !!