బాదంపప్పు మూడు రకాలు ఉంటాయి. అవి మామూలు బాదం పప్పులు, ఇండియన్ బాదం, సీమ బాదం. ఈ సీమ బాదం తీసుకుంటే 52 గ్రామ్స్ ఫ్యాట్, 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 5 గ్రాములు, దీనిలో ఉండే ఫ్యాట్ చాలా మంచి ఫ్యాట్ గుండె జబ్బులు రాకుండా, ఫ్యాటీ లివర్ రాకుండా, రక్తనాళాల్లో డిపాజిట్ అవ్వకుండా, మనం ఎక్కువ బరువు కూడా పెరగకుండా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో 35 గ్రాముల ఏమిగ్దలిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంది. ఇది స్పెషల్ గా విటమిన్ B 17 విటమిన్ ఈ సీమ బాదం పప్పులో చాలా రిచ్ ఉంది. క్యాన్సర్ కణాలను నిర్మూలించే విధంగా ఇది పనిచేస్తుంది.
B 17 విటమిన్ క్యాన్సర్ కణాల డివిజన్ కూడా నిర్మూలిస్తుంది అని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. ఈ నట్స్ ని ఎక్కువగా తినడం వల్ల బిపి సిస్టోలిక్ మరియు డయోస్టోలిక్ రెండు విధాలుగా తగ్గించడానికి ఈ సీమ బాదం కలిగిస్తున్నాయని కనుగొన్నారు. మరి ఇలాంటివి అన్ని కూడా 2020 లో మన్సౌర యూనివ్సిటీ ఈసిప్ట్ వారు ఈ సీమ బాదం యెక్క ప్రాముఖ్యతను తెలియచేశారు. ఈ సీమ బాదం పప్పు డయాబెటిక్ పేషంట్స కి చాలా మంచిది. ట్రై గ్లిజరాయిడ్ ఎక్కువ ఉన్న వారికి, కొలెస్ట్రాల్ సమస్యలు, LDL సమస్యలు ఎక్కువ ఉన్నవారికి చాలా మంచిది ఎందుకు అంటే ఈ సీమ బాదం పప్పులలో 5% మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కాబట్టి.
ఎవరైతే డయాబెటిస్ తో వెయిట్ తగ్గి నీరసంగా ఉంటారు అలాంటి వారికి ఈ బాదం పప్పులను రోజు ఒక పది పదిహేను తినగలిగితే వాళ్లకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, బరువు పెరుగుతారు కానీ షుగర్ పెరగదు. క్యాన్సర్ బారిన పడే ఇబ్బంది పడేవారు క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వాడే ఏమిగ్దలిన్ నేచురల్ గా అందించే ఈ సీమ బాదం పప్పులను నానబెట్టుకుని తింటే క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. వీటిని నానబెడితే వెగటు రాకుండా ఉంటాయి. వీటిని నానబెట్టుకుని తినొచ్చు లేదా కూరల్లో వేసుకుని కూడా తినొచ్చు. సాయంత్రం పూట డ్రై ఫ్రూట్స్ డ్రైనాస్ తినేటప్పుడు ఈ సీమ బాదం పప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చు.
కొంతమందికి ఇది చాలా మంచిది. ఇవి ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి.