Reduces Constipation Helps for Free Motion Worms

మలబద్ధకం నుంచి పరిష్కారం మరియు ఫ్రీ మోషన్ కు ఈ ఆకు బాగా ఉపయోగపడింది. మరియు కడుపులో ఉన్న నులిపురుగులను తగ్గించడానికి ఉపయోగించి చిట్కా

చిన్న పిల్లలకు మరియు కొంతమంది వయసులో ఉన్న పెద్దవాళ్ళకు కడుపులో నులిపురుగులు అనేవి చేరి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి కారణం అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం. మరియు కలుషిత నీటిని తీసుకోవడం వలన ఈ సమస్యలు ఏర్పడతాయి. ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల నులిపురుగులు లేదా వాటి గుడ్లు కడుపులోనికి ప్రవేశించి ప్రేగులలో వాటి సంతానాన్ని పెంచుకుంటాయి. ఇలా పెరిగిన నులి పురుగులు మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలను మరియు నీటిని గ్రహించి ఆరోగ్యంగా పెరుగుతాయి. దీని ద్వారా మనకు రావాల్సిన పోషకాలు మనకు లభించావు. మరియు మనలను బలహీన పరుస్తాయి.

నులిపురుగుల నుంచి విడుదల పొందడానికి మనకు ఎక్కువగా లభించే కుప్పింటకు బాగా సహాయపడుతుంది. ఈ ఆకులు మనకు రోడ్లపై ఎక్కడైనా లభిస్తాయి. ఎన్నో రీసెర్చస్ ప్రకారం ఈ ఆకు ను తీసుకోవడం ద్వారా నులి పురుగులు చనిపోతాయని నిరూపించబడింది. కుప్పింటకులను నీటిలో వేసుకుని బాగా మరగనివ్వాలి. ఇలా తయారైన కషాయాన్ని వాడకట్టు సహాయంతో వడకట్టి ఒక 50ml లేదా 25ml కషాయం ను ఒక వారం రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ నులి పురుగులు చనిపోతాయి. పది రోజుల తర్వాత  స్కాన్ చేయించుకుంటే నులి పురుగులు అనేవి కనిపించవు. 

అలాగే మలబద్దకంతో బాధపడేవారు కూడా ఈ ఆకులను తీసుకోవడం ద్వారా మంచి ఉపశమనం కలుగుతుందని రీసెర్చ్ ప్రకారం తెలిసింది. ముఖ్యంగా గర్భంతో ఉన్నవాళ్లు ఈ ఆకులకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ ఆకులు అబార్షన్ చేయడానికి దోహద పడతాయి. కనుక గర్భంతో ఉన్న వాళ్ళు వీటిని స్వీకరించకూడదు. ఈ కుప్పింటకులను మెత్తని పేస్టులాగా చేసుకొని వాటిని గోలిలు లాగా చేసుకోవాలి. వాటిని మలద్వారంలో లోపలికి వేలు సహాయంతో పంపించాలి. లేదా ఆ పేస్ట్ ను కూడా మలద్వారంలో లో వేలు సహాయంతో లోపలికి పంపించాలి.

ఈ విధంగా చేయడం ద్వారా ఈ ఆకు కున్న ఇరిటేషన్ స్వభావం వలన 10 నిమిషాలలో ప్రేగులలో మరియు రక్తనాళాలలో ఇరిటేషన్ ఏర్పడి మోషన్ ఫ్రీగా అవడానికి సహాయపడుతుంది. ఇలా మోషన్ ఫ్రీగా అవడానికి అలోపతిలో కొన్ని టాబ్లెట్లను ఇస్తారు. కానీ వాటి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కనుక ఇలా నేచురల్ గా లభించే వాటిని ఉపయోగించడం ద్వారా ఎటువంటి నష్టాలు ఉండవు మరియు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!