Reduces Nerve Weakness Improves Brain Power

మీవి కాదు అనుకొని 200 ఖర్చు చేస్తే చాలు నరాల్లో బలం పెరుగుతుంది…

ఆలివ్ ఆయిల్ అన్ని ఆయిల్స్ కంటే మంచిది అని అందరూ అంటారు. అలాంటి ఆలివ్ ఆయిల్ నీ ఆలివ్ ఫ్రూట్ నుంచి తీస్తారు. ఇది గుండెకు చాలా మంచిది, బీపీ కి చాలా మంచిది, అని రక్తనాళానికి చాలా మంచిది అని అందరూ వాడుతూ ఉంటారు. ఆయల్ మరిగినప్పుడు దాని లాభం అంత పోతుంది నష్టం మిగులుతుంది. కాబట్టి ఆలివ్ ఆయిల్ వాడడానికి బదులుగా ఆలివ్ ఫ్రూట్ వాడడం మంచిది. ఈ ఫ్రూట్ ని రెగ్యులర్ గా గనక వాడుకుంటే రక్తనాళానికి చాలా చాలా మంచిది. రక్తనాళాల సంబంధమైన సమస్యలు ఉన్నవారికి ఈ ఆలివ్ ఆయిల్ వాడటం మంచిది. 100 గ్రాముల ఆలివ్ ఫ్రూట్ ని తీసుకుంటే 115 కిలో క్యాలరీల శక్తి వస్తుంది. 

           కార్బోహైడ్రేట్స్ 6 గ్రాములు ప్రోటీన్స్ 0.8 గ్రాములు, ఫ్యాట్ 11 గ్రాములు, ఫైబర్ 3 గ్రాములు, ఐరన్ 3.3 mlg, ఇక సోడియం 872 mlg కొబ్బరినీళ్ళతో పోల్చుకుంటే ఈ ఆలీవ్ ఫ్రూట్లో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల ఆలీ ఫ్రూట్లో 140 mlg ఒలియురోపెన్ అనే కెమికల్ కాంపౌండ్ ఇది మెయిన్ గా రక్తనాళాలను రిలాక్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మన శరీరంలో రక్తనాళాలు 16 వేల మైళ్ళు పొడవు ఉంటాయి. ఈ రక్తనాళాలను రోడ్ల వలే పోల్చొచ్చు, రోడ్లు బాగుంటే ప్రయాణం బాగా సాగుతుంది అలానే రక్తనాళాలు స్మూత్ గా బాగుంటే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఆలివ్ ఫ్రూట్ లో ఉండే 80% ఫ్యాట్ అన్ సాలీబుల్ ఫ్యాట్.

                 ఇది రక్తనాళాల్లో ఫ్యాట్ ని పేరుకోకుండా చేసి రక్తనాళాలు హెల్దీగా ఉండేటట్టు చేస్తుంది. రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. గుండె సమస్యలు, బ్రెయిన్ ఇష్యూస్ రాకుండా చేయడానికి ఈ ఫ్యాట్ బాగా రక్తనాళాలకు సహాయపడుతుంది. స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది. స్ట్రెస్ తగ్గితే మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. నర్వ్ సిస్టం ని బాగా యాక్టివేట్ చేయడానికి బాగా ఆలివ్ ఫ్రూట్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అలాగే బ్రెయిన్ సెల్స్ లో గాని నర్వ్  సెల్స్ లో గాని బీటా అమిలోయెడ్ టా అనే ప్రోటీన్ చేరుకోకుండా క్లియర్ చేసి రక్తనాళాలు బ్రెయిన్ లో కూడా హెల్తీగా ఉండేటట్టు చేస్తుంది.

                   బ్రెయిన్ సెల్స్ కుచించు పోకుండా ఉండడానికి ఈ ఆలివ్ ఫ్రూట్ బాగా సహాయపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!