Reduces Ovarian Cysts Get Periods Regularly

PCOD సమస్యతో బాధపడే వారికి శాశ్వత పరిష్కారం….

సాధారణంగా ఆడవారు బరువు పెరగడం వల్ల ఈ PCOD సమస్యలకు గురి అవుతున్నారు. పీసీఓడీ అనగా పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ తో ఎక్కువగా బాధపడుతున్నారు. ఆడపిల్లల్లో ఓవరీస్ లో నీటి బుడగలు ఏర్పడతాయి. ఇలాంటి నీటి బుడగలు ఎలా ఏర్పడతాయంటే ఓవరీస్ లో రిలీజ్ అయ్యే ఎగ్స్ మెచ్యూర్ అయ్యి రిలీజ్ అయితే హెల్ది దీనివల్ల హార్మోన్స్ బాగుంటాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది, సైకిల్స్ బాగుంటాయి. అలా కాకుండా ఇన్ మెచ్యూర్ ఎగ్స్ రిలీజ్ అయ్యి ఓవర్ ఇస్యులో ఫామ్ అవుతాయి. దీనివల్ల ఓవరీస్లో నీటి బుడగలు ఏర్పడతాయి. దీనివల్ల హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అయి, ప్రెగ్నెన్సీ రాకపోవడం, సైకిల్స్ లో మార్పులు జరుగుతాయి.

              వీటిని ఆపరేషన్ ద్వారా తొలగించవచ్చు కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. ముందుగా శరీర బరువును తగ్గించుకోవాలి. దీనికి కొన్ని ఆహార నియమాలు పాటించాలి. అవి ఏమిటి అంటే, సాధారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఓవరీస్ లో నీటి బుడగలు ఎక్కువ వస్తాయి. జీవనశైలిలో పూర్తిగా సవరించుకోవడమే దీనికి శాశ్వత పరిష్కారం. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీనివల్ల హార్మోన్స్ లో మార్పులు వస్తాయి. హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సమస్యలు వస్తాయి. డయాబెటిక్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించాలి. ఒబైసిటిని తగ్గించాలి. ఈ రెండు తగ్గాలంటే ఫస్ట్ డైట్ లో రైస్ మానేసి ఒక్క పుల్కా లేదా ఒక జొన్న రొట్టె రెండు రకాల కూరలతో తినాలి. 

       ఇలా చేయడం వల్ల క్యాలరీస్ తగ్గుతాయి. రైస్ తీసుకోకపోవడం వల్ల తగ్గుతుంది. తద్వారా బరువు కూడా తగ్గుతారు. సాల్ట్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ వస్తుంది. దీనిని తగ్గించడానికి ఉదయం పూట మిక్సీడ్ వెజిటేబుల్ జ్యూస్ తాగాలి. 45 నిమిషాల తర్వాత రెండు రకాల మొలకలు లేదా పండ్లు తినాలి. సాయంత్రం పూట పండ్లు జ్యూస్ తాగాలి. 45 నిమిషాలు తరువాత డ్రై నట్స్ కొద్దిగా తినాలి. ఇది హార్మోనల్ డైట్. దీనివల్ల ఇన్సులిన్ తగ్గుతుంది. వ్యాయామం రోజుకి రెండు గంటలు చేయాలి, ఇలా చేస్తే వెయిట్ లాస్ అవుతారు. ఆరోగ్యంగా ఉంటారు.

    ‌‌          ఇలాంటి డైట్ పాటించడం వల్ల ఓవరీస్ లో ఉన్న నీటి బుడగలు తగ్గి పూర్తిగా సమస్య అనేది తగ్గి, బరువు కూడా తగ్గుతారు. ఇలా ఆహార నియమాలు పాటించడం వల్ల నాలుగు నెలల్లో బరువు తగ్గించు కోవడమే కాకుండా PCOD సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.

Leave a Comment

error: Content is protected !!