Reduces Summer Dehydration Cool Drinks in Summer

సమ్మర్ లో శీతల పానీయాలు అసలు వద్దు ఎందుకో తెలుసా!

వేసవిలో చల్ల చల్లగా ఏమైనా తాగితే బాగున్ను, చల్లగా ఏమైనా తింటే బాగున్ను అనిపిస్తుంది. కానీ శీతల పానీయాలు, పదార్థాలు  అసలు తీసుకోకూడదు.ప్రిడ్జ్ లో పెట్టినవి తినడం లేదా తాగడం వలన నష్టమే తప్ప లాభం ఏమి ఉండదు.దీనివలన రెండు ప్రధానమైన నష్టాలు ఉన్నాయి. ఒకటి రక్షక వ్యవస్థకి , రెండు పొట్టకి. రకరకాల వైరస్ ల బారి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి రక్షక వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. 

కానీ శీతల పానీయాలు, పదార్థాలు తీసుకోవడం వలన మన రక్షక వ్యవస్థ దెబ్బతింటుంది. మనం మన చేతులతోనే రక్షక వ్యవస్థ పనితీరును దెబ్బతీయడం వలన వైరస్ తో పోరాడే సామర్ధ్యాన్ని కోల్పోతుంది. శీతల పానీయాలు పదార్థాలు తీసుకోవడం వలన మన పొట్టను ముప్ప తిప్పలు పెట్టినట్లు అవుతుంది. కూల్ డ్రింక్స్, మిల్క్ షేక్స్, పుచ్చ కాయ ముక్కలు, లస్సీ, మజ్జిగ ఇలా ఏదైనా సరే వేసవకాలం వచ్చేసరికి ఐసులో పెడతారు. 

ఇవి తీసుకోవడం వలన నోటిలో ఉండే ప్రైమరీ సెక్యూరిటీ పోర్స్ రెండు రకాలుగా పనిచేస్తుంది. నోటి ద్వారా కడుపులోకి తీసుకునే ఏ ఆహారం అయినా నోటిలో ఉండే లాలాజల గ్రంధులు ఆక్టివేట్ అయ్యి రక్షక వ్యవస్థకి , రక్షక దళం మొత్తాన్ని ఆక్టివేట్ చేస్తుంది. కానీ శీతల పానీయాలు పదార్థాలు తీసుకోవడం వలన నోటిలో లాలజలం ఉత్పత్తి అవ్వదు. దీనివలన వైరస్, బాక్టీరియా, ఫంగస్ వంటివి శరీరంలోకి ప్రవేశించిన మన రక్షక వ్యవస్థ కు తెలీదు.

శీతల పానీయాలు పదార్థాలు వలన నోటిలో జరిగే మెకానిజం మొత్తం దెబ్బతింటుంది. శీతల పానీయాలు తీసుకోవడం వలన క్రిములు నోట్లో నుండి తప్పించుకుని వచ్చినా సరే కడుపులో ఉండే హైడ్రో క్లోరిక్ ఆమ్లం నాశనం చేస్తుంది. కానీ శీతల పానీయాలు పదార్థాలు తీసుకోవడం వలన కడుపులో ఉండే పొరలు కూడా పాడవుతాయి. దీనివలన డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్లో అవుతుంది. మన పొట్ట ఉష్ణోగ్రత 37డిగ్రీ సెంటి గ్రేడ్స్ ఉంటుంది. మన రూమ్ ఉష్ణోగ్రత 25డిగ్రీ సెంటీ గ్రేడ్స్ నుండి వేసవకాలములో 35డిగ్రీ సెంటీ గ్రేడ్స్ వరకు ఉంటుంది. 

మనం తినే ఆహారం 5నుండి 10డిగ్రీలు ఉంటుంది. ఆహారం జీర్ణం అవ్వలంటే 35డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నపుడు మాత్రమే ఆహారం జీర్ణం అవుతుంది. శీతల పానీయాలు తాగడం వలన కడుపు ఉష్ణోగ్రత 18డిగ్రీలకు వచ్చేస్తుంది. దీనివలన హైడ్రో క్లోరిక్ ఆసిడ్ ఉత్పత్తి, జీర్ణ క్రియకు అవసరం అయిన ఎంజైముల ఉత్పత్తి అన్ని ఆగిపోతాయి.

మళ్ళీ కండరాలు , పొట్ట అంచులలో పొరలు వేడెక్కి ముడుచుకున్నవి విడుచుకునే వరకు జీర్ణక్రియ జరగదు. హైడ్రో క్లోరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవడం కూడా నష్టమే. బాగా వేడిగా తినలేము కాబట్టి కొంచెం చల్లర్చుకుని తినొచ్చు కానీ ప్రిడ్జ్లో పెట్టుకుని మాత్రం తినకూడదు. కుండ చల్లదనాన్ని అలవాటు చేసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు.

Leave a Comment

error: Content is protected !!