కాకరకాయ కున్నంత చేదు ఈ ఆకాకరకాయలో ఉండదు. ఇవి అడవుల్లో ఎక్కువగా దొరుకుతుంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలును కలగ చేస్తాయి. ఈ ఆకాకరకాయ లో కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా దీనిలో లభిస్తాయి. ఈ సీజన్ లు మారినప్పుడు వచ్చే అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. బీపీ కంట్రోల్ లో ఉండేటట్టు చేస్తుంది. డయబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి రక్తంలో చక్కెర స్థాయిని పెరగకుండా కాపాడుతుంది. ఆకాకర కాయ జీర్ణ వ్యవస్థను బాగా మెరుగు పరుస్తుంది.
100 గ్రాముల ఆకాకరలో కేవలం 17 కేలరీలు మాత్రమే లభిస్తాయి. వీటిలో ఫొలేట్లు ఎక్కువ ఉండడం వల్ల శరీరంలో కొత్త కణాలు ఏర్పడి చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. ఈ ఆకాకరకాయను తినడం వల్ల గర్భస్థ శిశువు ఎదుగుదలకు మెరుగు పడుతుంది. ఆకాకరకాయ అనేది పొట్టల్లో, ప్రేగుల్లో ఉండే పుండ్లను మాన్పించడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిని సైంటిఫిక్ గా జర్మనీ వారు నిరూపించడం జరిగింది. ఈ ఆకాకరకాయ ఎక్స్ట్రాక్ట్ ని 400 mg ఎలుకలకి ప్రతిరోజు ఇచ్చేవారు. ఇలా ఏడు రోజులు ఇచ్చే సరికి పొట్టలో ఉండే అల్సర్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇక ఈ ఆకాకరకాయ వల్ల ఎందుకు ఇంత లాభం అని ఆలోచిస్తే పొట్ట అంచుల వెంబడి, పేగుల యొక్క అంచుల వెంబడి మ్యూకస్ సెక్రిషియన్ ని బాగా పెంచుతున్నాయి.
జిగురు ఉత్పత్తి ఎక్కువ అవడం వల్ల యాసిడ్ దాడి అంచుల వెంబడి చేయడానికి అవకాశం ఉండదు. కొంతమందికి లోపల అధికంగా గ్యాస్ట్రిక్ జూసెస్, హైడ్రోక్లోరిక్ ఆసిడ్స్ ఇర్ రేగులర్ గా ఊరతాయి. వాటిని రెగ్యులర్ గా చేయడానికి ఎంత ఊరాలో అంతే ఊరేటట్టు చేస్తుంది. కొంతమందికి యాసిడ్ ఘాటు అధికంగా ఉండడం వల్ల అల్సర్ వస్తాయి. ఎంత ఉంటే మంచిదో ఆ యాసిడ్ ఘాటుని అంత స్థితికి తీసుకుని వస్తుంది. ఆ కాకరకాయల్లో ఉండే కరోటినోయిస్ కంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. కాబట్టి సీజన్లో దొరికే వీటిని రోజుకి ఒక 100 గ్రాములు ఆకాకరకాయని ఫ్రై లా చేసుకోవచ్చు. కానీ ఆయిల్ వేయకుండా నాన్ స్టిక్ లో చేసుకోవాలి.
లేదు అనుకుంటే మసాలా వేసుకుని కూర లాగా కూడా వండుకొని తినొచ్చు. ఇలా చేసుకోవడం వల్ల లాభమేగాని నష్టమేమీ ఉండదు. ఈ ఆకాకరకాయ వల్ల బెనిఫిట్స్ అన్ని లభిస్తాయి.