Reduces Weight Fast Boosts Immunity Life Span

బరువు త్వరగా తగ్గడానికి..…. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి……. జీవితకాలం పెరగడానికి ఉపయోగపడుతుంది.

ఆరోగ్యమే మహాభాగ్యము అని పెద్దలు చెబుతారు. అలాంటి మహాభాగ్యం ఎంత మంది అనుభవిస్తూ ఉన్నారు.  మనం అనుభవిస్తుంది నిజంగా మహాభాగ్యమా కాదా.అలా అన్నారు అంటే ఋషులు దాన్ని అనుభవించారు కాబట్టే అది అక్షరాలా నిజం అయ్యింది. మనం అన్ని భాగ్యాలు అనుభవిస్తూన్నం. కానీ ఆరోగ్యభాగ్యాన్ని కోల్పొతున్నాం. ఎందుకంటే మన బలహీనతలు, ఇంద్రియాలు. మన కన్ను చూసిందాల్ల కావాలనుకుంటుంది. నోరు రుచిగా ఉన్న ప్రతిది తినాలనుకుంటుంది. అందువలన ఇంద్రియాల‌ వేనుక మనం పరుగులు తిస్తు మన జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాం.

వచ్చిన రోగంను పోగొట్టుకోవాలి అన్నా, లేని రోగాలు రాకుండా ఉండాలి అన్నా, ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది అనుభవించాలి అన్నా పరిష్కారం ఉంది. అన్ని సుఖాల కన్నా ఎక్కువ సుఖం అనిపించేది ఈ ఆహార సుఖం. రుచికి అలవాటు పడిపోయి ఈ ఆహార సుఖం అనేదానికి మనం బానిసలైపోయి అనారోగ్యాలకు గురి అవుతున్నాం. ఆరోగ్య భాగ్యాన్ని దూరం చేసుకునేది ఆహారం వలెనే. ఇలాంటి  వాటినుంచి మనల్ని రక్షించే ఆహారం సూర్యాహారం. దీనిని ప్రకృతి ఆహారం అని కూడా అంటారు. వీటి వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే.

1. నాచురాల్ గా తినే ఆహారంలో ఉప్పులు, కారాలు, మసాలాలు, నూనెలు ఉపయోగించం. ఈ‌ చెడు వెల్లకపొవడం అనేది ప్రధాన ఆరోగ్యకర లాభం. అంటే మనకు ఆరోగ్యం కలిగించే కారాలు, ఉప్పులు  వేళ్లావు కనుక మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది.

2. వండిన ఆహారాలు తినడం వలన వాటిలోని పోషకాలను కోల్పోతాం. పోషకాలు కోల్పోవడం వలన మనకు పోషకాలు లభించవు దాని ద్వారా అవయవాలు సరిగ్గా పని చేయవు. రక్షణ వ్యవస్థ క్షీణిస్తుంది. ఆయుర్దాయం తగ్గుతుంది. ఈ రెండు నష్టాలను మనం తగ్గించుకోవాలంటే ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవాలి. మనకు దీన్ని తినే అదృష్టం లభిస్తే గనుక మంచి ఆరోగ్యం మనకు లభించినట్లే.

 ఇలా రా ఫుడ్ తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ మలబద్ధకం వంటి సమస్యల నుంచి విడుదల పొందవచ్చు. అంతేకాకుండా వెయిట్ లాస్ లో కూడా చాలా ఉపయోగపడుతుంది. మరియు లివర్ డీ టాక్స్ఫికేషన్ బాగా జరుగుతుంది. మరియు శరీర దుర్వాసనలు ఉండవు. మరియు రాత్రిపూట నిద్ర బాగా పడుతుంది. ఉదయం త్వరగా మెలుకువ వస్తుంది. శరీరం పూర్తిగా రిలాక్స్ అయ్యి  గాలిలో తెళ్తున్నట్లు ఉంటుంది. కనుక రోజు సూర్య ఆహారం తీసుకోవడం వలన చాలా లాభాలు ఉంటాయి.

Leave a Comment

error: Content is protected !!