చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని చెట్లు చేమలు కాలువ గట్లు, కాకెంగిల్లు మధ్య ఎంతో అపురూపంగా అనిపిస్తుంది. ఆ అపురూపమైన జ్ఞాపకల్లో తప్పక రేగు పళ్ళు కూడా ఉంటాయి. నేరుగా చెట్ల నుండి తెంపుకుంటూ, పుల్లపుల్లగా, తీయతీయగా వాటిని ఆస్వాదిస్తూ గడిపిన ఆ బాల్యం గుర్తొస్తే ఇపుడు ఆ రేగుపళ్ళు అప్పటిలా తినలేక మిస్సయిపోతున్న ఫీలింగ్. ముఖ్యంగా చదువులు, ఉద్యోగాల్లో చెరకు, రేగుపళ్ళు వంటి వాటిని బాగా మిస్సవుతాము. అయితే ఈ రేగుపళ్ళు చిన్ననాటి తిండి మాత్రమే కాదు పెద్దలు కూడా తప్పక తినాలి, ఎందుకంటే చూడండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.
మంచి నిద్రకు సహకరిస్తుంది.
నిద్రలేమి వంటి నిద్ర సమస్యలకు రేగుపళ్ళు సూపర్ గా పనిచేస్తాయి. పండు మరియు విత్తనాలు రెండిటిలో ఫ్లేవనాయిడ్లు- సాపోనిన్లు మరియు పాలిసాకరైడ్లు సమృద్ధిగా ఉంటాయి. సాపోనిన్ అనేది సహజమైన నిద్రను ప్రేరేపించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి నదీ వ్యవస్థ పై ప్రభావం చూసి అలసటను దూరం చేసి మంచి నిద్ర పట్టేలా సహాయపడుతుంది..
దీర్ఘకాలిక మలబద్ధకం తగ్గిస్తుంది
మనదేశంలో 22 శాతం మంది దీర్ఘకాలిక మలబద్దకంతో బాధపడుతున్నారు. మలబద్ధకం వంటి ఇబ్బందికరమైన సమస్యను బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడనివారు కోకొల్లలు ఉంటారు. ఈ మలబద్దకం గ్యాస్ సమస్యలను మరియు పేగు సంబంధ సమస్యలను వెంట తీసుకువస్తుంది. అయితే రేగు పళ్ళు ఈ సమస్యను సులువుగా అధిగమిస్తాయి. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణాశయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరియు పేగు కదలికలను చురుగ్గా ఉంచి మలబద్దకాన్ని తగ్గిస్తుంది. .
ఆందోళనను తగ్గిస్తుంది
రేగుపళ్ళు మెదడు మరియు నాడీ వ్యవస్థపై ప్రభావాన్నీ చూపుతుంది. మెదడులో కణాలపై ఒత్తిడి తగ్గించి ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. రేగుపళ్ళు లో ఉండే గుణాలు మానసిక అలజడులను తగ్గించడిజంలో ఉత్తమమైన ఎంపిక. వీటిని తీసుకోవడం వల్ల హార్మోన్లను సక్రమంగా విడుదలయ్యేలా చేస్తాయి. తద్వారా మెదడు పనితీరును ప్రేరేపిస్తాయి.
విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది.
రేగుపళ్లలో అవసరమైన విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ముఖ్యంగా విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ సి చర్మ సంరక్షణలో సహాయపడుతుంది, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది మరియు వ్యాధులను అరికట్టడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 100 గ్రాముల రేగుపళ్లలో 69 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. మన శరీరం సహజంగా విటమిన్ సి ఉత్పత్తి చేయలేనందున, లభ్యమయ్యే సహజ వనరులను ఎక్కువగా ఉపయోగించడం చాలా ముఖ్యం. అందులో రేగుపళ్ళు ఉత్తమ ఎంపిక.
రక్తపోటును నియంత్రిస్తుంది
వీటిలో తక్కువ సోడియం మరియు అధిక పొటాషియం కంటెంట్ ఉంటాయి. రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంచడంలో మరియు రక్త నాళాలు సడలించటానికి పొటాషియం సహాయపడుతుంది. రక్త నాళాలు సడలించినప్పుడు, సున్నితమైన రక్త ప్రవాహం ఉంటుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది.
రక్త ప్రసరణను నియంత్రిస్తుంది
రేగుపళ్లలో ఇనుము మరియు భాస్వరం మెండుగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను నియంత్రించడంలో సహాయపడతాయి. రక్తహీనతలో తక్కువ ఐరన్ కంటెంట్, కండరాల బలహీనత, అలసట, అజీర్ణం, తేలికపాటి తలనొప్పి వంటి సమస్యలు రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఎదురవుతాయి. అయితే రేగుపళ్ళు తీసుకోవడం వల్ల రక్త ప్రవాహాన్ని పెంచడమే కాక, రక్త ప్రసరణను వ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది కూడా.
ఎముక బలాన్ని మెరుగుపరుస్తుంది
వీటిని తినడం వల్ల బలమైన ఎముకలు సొంతమవుతాయి. రేగుపళ్లలో కాల్షియం, ఫాస్పరస్ మరియు ఐరన్ ల సమ్మేళనంతో నిండి ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని మెరుగుపరుస్తుంది. బోలు ఎముకల వ్యాధి మరియు ఇతర ఎముక బలహీనత సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని అధిగమించడానికి రేగుపళ్లను తీసుకుంటే సమస్య సులువుగా తగ్గిపోతుంది.
చివరగా…..
రేగుపళ్ళు అనేవి ఆరోగ్యానికి ఎంతో దోహాధం చేస్తాయి కాబట్టి తాజాగా ఉన్నవి తినడమే కాకుండా వడియాలు లాగా తయారుచేసుకుని తరచుగా తింటుండటం ఉత్తమం.