ప్రస్తుతం అందరికీ కాళ్లు నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడుం నొప్పి నరాల బలహీనత వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. రోజంతా పనిచేయడం వలన ఎలాంటి నొప్పులు వచ్చి అవి ఉదయ మరుసటి రోజు ఉదయానికి తగ్గిపోతే అది పర్వాలేదు. మరుసటి రోజు ఉదయానికి కూడా అలానే ఉంటే గనుక తప్పనిసరిగా జాగ్రత్త పడాల్సిందే. దీనికి కారణం వాతం. శరీరంలో వాత దోషం ఎక్కువైనప్పుడు ఎముకల్లో నొప్పి రావడం, తగ్గిపోవడం, తలనొప్పి, జీర్ణసంబంధ సమస్యలు వస్తుంటాయి.
తల నొప్పి నుండి పాదాల వరకు ఎటువంటి సమస్య అయినా గ్యాస్ లేదా అసిడిటీ వంటి సమస్యలతో బాధపడే వారికి వెంటనే వస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఈ డ్రింక్ తాగినట్లయితే నడుం నొప్పి, వెన్ను నొప్పి, ఎముకల బలహీనత, వాతం వంటి సమస్యలు తగ్గుతాయి. దీనికోసం ముందుగా మన స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. దీనిలో అర చెంచా శొంఠి పొడి వేసుకోవాలి. శొంఠి వల్ల జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది శొంఠి గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో అధిక కొవ్వును తగ్గిస్తుంది.
దీనిలో ఒక చెంచా వాము వేసుకోవాలి. వాము గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాములో కూడ అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వాము ప్రతి రోజు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. పొట్ట శుభ్రం అయితే శరీరంలో అధిక కొవ్వు కూడా తగ్గిపోయి అధిక బరువు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. తర్వాత దీనిలో ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. బిర్యానీ ఆకు శరీరంలో పొట్టకు సంబంధించిన సమస్యలు, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడానికి బిర్యానీ ఆకు చాలా బాగా సహాయపడుతుంది.
ఈ మూడింటిని వేసి బాగా కలుపుకొని రెండు గ్లాసుల నీళ్లు సగం అయ్యేంత వరకు మరిగించి పోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గ్లాసులో వడగట్టుకుని ఒక చెంచా బెల్లం పొడిని వేసుకొని టి తాగినట్లుగా కొంచెం కొంచెం గా తాగాలి. ఇలా ప్రతి రోజూ ఉదయాన్నే పరిగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో వాత దోషం తగ్గుతుంది. అధిక కొవ్వు కరిగించి అధిక బరువు సమస్యలను కూడా తగ్గిస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ డ్రింక్ ను ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున టీ తాగినట్లు గా కొంచెం కొంచంగా తాగుతూ ఉండాలి. ఈ డ్రింక్స్ తీసుకోవడం వల్ల నడుము నొప్పి, ఎముకల బలహీనత, వెన్ను నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.