బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ప్రతి ఒక్కరికి వచ్చే సర్వసాధారణమైన సమస్య. వీటిని రిమూవ్ చేసుకోవడం కోసం పార్లర్ కి వెళ్తే 1500 నుండి 2000వరకు వసూలు చేస్తారు. ఎటువంటి ఖర్చు మరియు నొప్పి లేకుండా ఇంట్లోనే బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ముఖానికి ఆవిరి పట్టించుకోవాలి. దీనికోసం డైరెక్టుగా ఆవిరి పట్టిన సరే లేదా వేడి నీటిలో టవల్ ముంచి ఆవిరి పెట్టిన సరిపోతుంది. తర్వాత హెయిర్ పిన్ లేదా శారీ పిన్ వెనుక భాగంతో వైట్ హెడ్స్ లేదా బ్లాక్ హెడ్స్ ప్రెస్ చేయడం వలన చాలా వరకు రిమూవ్ అవుతాయి.
ఇంకా ఏమైనా ఉండిపోతే రిమూవ్ అవ్వడం కోసం స్క్రబ్ ఉపయోగపడుతుంది. ఒక బౌల్ తీసుకుని ఒక చెంచా టూత్ పేస్ట్, ఒక చెంచా బియ్యప్పిండి, ఒక చెంచా షుగర్, ఒక చెంచా తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ఉన్న భాగంలో అప్లై చేసి స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ రిమూవ్ అవుతాయి. వీటిని రిమూవ్ చేసే ప్రాసెస్ లో పోర్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. పోర్స్ ఓపెన్ అయి ఉండటం వలన పింపుల్స్ వస్తాయి.
కాబట్టి పోర్స్ క్లోజ్ అవ్వడం కోసం ఏదైనా ప్యాక్ వేసుకోవాలి. దీనికోసం బాగా పండిన అరటిపండు సగం తీసుకోవాలి. అరటి పండు మెత్తగా చేసుకుని దానిలో ఒక చెంచా గోధుమ పిండి, ఒక చెంచా మిల్క్ పౌడర్, ఒక చెంచా పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరేవరకు ఉండనివ్వాలి. తర్వాత నీటితో తడిపి నెమ్మదిగా మసాజ్ చేసుకుని చల్లని నీటితో కడిగేసుకోవాలి ఇలా చేసినట్లయితే పోర్స్ అన్ని క్లోజ్ అవుతాయి. చర్మంపై ఉండే అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి.
ఇప్పటి నుండి బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ సమస్యతో బాధపడేవారు పార్లర్కి వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టకుండా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఎటువంటి నొప్పి మరియు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవచ్చు. ఈ రెమెడీ ఆడవారికి, మగవారికి కూడా ఉపయోగపడుతుంది.