ముఖం, ఇతర శరీర భాగాలపై తీసుకొనే శ్రద్ధ పాదాలపై మనం తీసుకోము. అందుకే పాదాలపై పేరుకున్న మృత కణాలు పాదాల పగుళ్ళుకు, నల్లటి టాన్కి కారణం అవుతాయి. ఇంకా ఎంత బాగా తయారైనా పాదాలు ఎన్ని రకాలు శాండిల్స్, నెయిల్ పాలిష్ లు పెట్టినా పాదాల ఆరోగ్యంగా ఉండటం వలన మరింత అందం వస్తుంది. అందుకే అప్పుడప్పుడు పాదాల కోసం కూడా శ్రద్ధ తీసుకోవాలి.
కొంతమందికి పాదాల పగుళ్లు వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి వారు కనీసం నెలకి ఒకసారైనా పాదాలను శుభ్రం చేసుకొని వాటి కోసం కొద్దిగా శ్రద్ద కనబరిస్తే అందమైన పాదాలతో పాటు పాదాల పగుళ్లు సమస్య కూడా తగ్గుతుంది. దాని కోసం మనం చేయవలసిన స్టెప్స్ బై స్టెప్ గా తెలుసుకుందాం. మొదట ఒక టబ్లో వేడి నీళ్ళు పోసుకోవాలి.
గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక స్పూన్ షాంపూ, నిమ్మరసం, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. అందులో పదిహేను నిమిషాలపాటు కాళ్లను నానబెట్టాలి. తరువాత పాదాలను టూత్ బ్రష్ తో తోమాలి. పాదాలను తోమడం వల్ల కాళ్లపై పేర్కొన్న మృతకణాలు తొలగిపోతాయి. గోళ్ళలో మట్టి కూడా శుభ్రపడుతుంది.
కొంచెం పేస్ట్ ఉపయోగించి పాదాలను శుభ్రం చేయడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది. తర్వాత ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ షుగర్, అర చెక్క నిమ్మరసం పిండాలి. ఈ మిశ్రమాన్ని నిమ్మచెక్కతో పాదాలను చేయడంవల్ల మరింత శుభ్రంగా కాంతివంతంగా తయారవుతాయి.
నిమ్మ చెక్కతో ఈ మిశ్రమాన్ని తీసుకొని పాదాలను తోమడం వలన పాదాల పగుళ్ల లో చేరిన మట్టి, బ్యాక్టీరియా బయటకు వెళ్ళిపోతుంది. పాదాల పగుళ్లు సమస్య తగ్గుతుంది. తరువాత పాదాలను నీళ్లతో శుభ్రపరచుకోవాలి. ప్యూమిక్ టోన్ తో పాదాలను శుభ్రం చేయడం వలన చనిపోయిన చర్మకణాలు తొలగిపోతాయి పాదాల పగుళ్ళకు ఈ మృతకణాలు కారణమవుతుంటాయి.
ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలిపి పాదాలకు ప్యాక్ లా వేయాలి. దీనిని ఆరేవరకూ పాదాలకు ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాలపై పేరుకున్న నల్లగా ఉన్న భాగాన్ని శుభ్రం చేస్తుంది.ఇప్పుడు గోళ్ళకు నెయిల్ పాలిష్ వేయడం వల్ల పాదాలకు మంచి లుక్ అందిస్తుంది. ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు సమస్య అనేది అసలు ఉండదు. అంతే కాకుండా పాదాలు కూడా అందంగా కనిపిస్తుంటాయి.