ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది జుట్టు రాలడం, చుండ్రు, తలలో పేలు, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని తగ్గించుకోవడానికి రకరకాల షాంపూలు, హెయిర్ ప్యాక్స్ , ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా ఈ చిట్కాలు ఉపయోగించి తలలో పేలు, చుండ్రు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గించుకోవచ్చు. దీని కోసం మనం ముందుగా మీ జుట్టుకు సరిపడినంత కొబ్బరి నూనెను ఒక బౌల్లో తీసుకోవాలి.
దీనిలో మూడు కర్పూరం బిళ్లలను మెత్తగా పొడి చేసి వేసి బాగా కలుపుకోవాలి. ఈ నూనెను తలకు అప్లై చేసుకుని మూడు గంటల పాటు అలాగే ఉంచాలి. తర్వాత తలస్నానం చేయాలి. వాసనకు ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్న వారు ప్రతిరోజు ఉపయోగించుకోవచ్చు. ఈ నూనె వారానికొకసారి అప్లై చేసినట్లయితే తలలో ఉండే చుండ్రు, ఇన్ఫెక్షన్, పేలు తగ్గిపోతాయి. తలలో వచ్చే చిన్న చిన్న పొక్కులు కూడా తగ్గుతాయి. చుండ్రు ఉండడం వలన జుట్టు పెరగదు. ఈ నూనె అప్లై చేయడం వల్ల చుండ్రు కూడా తగ్గుతుంది.
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. రెండవ చిట్కా మెంతులను నానబెట్టి పేస్ట్ చేసి వాళ్ళు కూడా కర్పూరం బిళ్ళలు వేసి తలకు అప్లై చేసి రెండు లేదా మూడు గంటల పాటు ఉంచడం వలన తలలో పేలు, చుండ్రు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ ప్యాక్ ను కూడా వారానికి ఒకసారి అప్లై చేయాలి. మూడవ చిట్కా రెండు లేదా మూడు చెంచాల కొబ్బరి నూనె లో ఒక చెంచా వేప నూనె వేసి బాగా కలిపి తలకు అప్లై చేసి రెండు లేదా మూడు గంటల పాటు ఉండనివ్వాలి. తర్వాత తల స్నానం చేయాలి.
ఇలా వారానికొకసారి చేయడం వల్ల తలలో పేలు, చుండ్రు, ఇన్ఫెక్షన్స్, కురుపులు వంటి సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. లేత వేపాకులు దొరుకుతాయి అనుకున్నవారు ఆకులను పేస్ట్ చేసి తలకు అప్లై చేయడం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. మాకు వేపాకులు లేదా వేప నూనె దొరకదు అనుకున్నవారు మార్కెట్లో రెడీమేడ్ వేపాకు ఫోటో దొరుకుతుంది దానిని పుల్లటి పెరుగులో కలిపి తలకు అప్లై చేస్తే రెండు లేదా మూడు గంటల పాటు ఉండనివ్వాలి. తర్వాత తలస్నానం చేయడం వలన కూడా చుండ్రు, పేలు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి.
ఈ చిట్కాలను ఒకేసారి ట్రై చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏది నచ్చితే ఆ చిట్కాను ట్రై చేయవచ్చు. ఏ చిట్కా ట్రై చేసిన ఒకసారికే మంచి ఫలితం ఉంటుంది.