Remove Pimples and Dead Cells

ముఖంపై మొటిమలు పోగొట్టడానికి ఈ కాంబినేషన్ బెస్ట్

చాలామంది ఇది మొటిమల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి త్వరగా తగ్గిపోతే కొంతమంది మాత్రం అవి పెద్దగా ఉండి బాధపెడుతుంటాయి. అవి తగ్గేందుకు ఎటువంటి చిట్కాలు వాడినా పెద్దగా ఫలితం ఉండదు.

దీనికి కారణం యుక్త వయసులో ఉన్న పిల్లలకు హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. యుక్త వయసులోకి వచ్చిన 13  సంవత్సరాలు పిల్లలు నుండి 40 ఏళ్ల వారికి ఎక్కువగా మొటిమలు వస్తూ ఉంటాయి. 25ఏళ్ల పైన వారికి వస్తే దానిని అడల్ట్ యాక్నే అంటారు. 

యుక్తవయస్సు వచ్చినప్పటి నుండి శరీరంలో హార్మోన్స్ సెబాసిస్ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. దీని వలన సెబం ఆయిల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఆయిల్లో బ్యాక్టీరియా ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఆయిల్ ను విచ్ఛిన్నం చేసి ఇరిటేషన్ కలిగిస్తుంది.

దీని వల్ల మొటిమలు,   వైట్ హెడ్స్, బ్లాక్హెడ్స్, చిన్న చిన్న ఎరుపు రంగు కురుపులు, పెద్ద గడ్డల్లా ఉండే మొటిమలు, పిగ్మెంటేషన్ వంటివి ఉంటాయి. ఈ మొటిమలు చాతి మీద వీపు మీద, భుజాలకు, ముఖంపై ఎక్కువగా కనిపిస్తుంటాయి.

 కొంతమంది చుండ్రు ఉండటం వలన మొటిమలు వస్తున్నాయి అనుకుంటారు. కానీ అది అపోహ. శరీరంలో ఉత్పత్తి పెరగడం వలన తలలో కూడా నూనె అధికంగా పేరుకుపోయి చుండ్రు సమస్య ఎక్కువ అవుతుంది.

మొటిమలు ఉన్న వారికి చుండ్రు కూడా ఉండే అవకాశం ఉంది. కానీ చుండ్రు ఉండటం వల్ల మొటిమలు రావు. దీనికి డాక్టర్ సలహాతో క్రీములు వాడవచ్చు. కొన్ని రకాల రసాయనాలు ఉండే ఫేస్ క్రీమ్, ఫేస్ వాష్ లు, స్క్రబ్లు వాడవచ్చు. విటమిన్ ఏ టాబ్లెట్ వాడడం వలన కూడా తగ్గించుకోవచ్చు.

 సోషల్ మీడియాలో చూసే అన్నిరకాల చిట్కాలు పాటించడం వలన సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది. మొటిమలు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు పోషకాహారం తీసుకుంటూ శరీరానికి తగినంత నీరు తాగుతూ, పండ్లు, పండ్ల రసాలు తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.

కొంతమందికి కెమికల్ పీల్స్ ఎక్కువగా చేస్తుంటారు. డాక్టర్ సలహా లేకుండా ఇటువంటి సొంత చికిత్సలు చేసుకోకూడదు. మొటిమలు తక్కువగా ఉన్నప్పుడే చికిత్స తీసుకోవడం వలన శాశ్వతంగా నివారించవచ్చు. ఈ చికిత్స కనీసం మూడు నుండి ఆరు నెలల వరకు ఉంటుంది. ఒక నెల వాడి మానేయకుండ డెర్మటాలజిస్ట్ సలహాతో మందులు వాడండి.

Leave a Comment

error: Content is protected !!