remove unwated hair permanently with home remedies

ఇలాచేస్తే చాలు మీ అవాంఛిత రోమాలు శాశ్వతంగా రాలిపోతాయి తిరిగి జన్మలో రావు.

హలో ఫ్రెండ్స్.. “అవాంఛిత రోమాలు” చాలామంది అమ్మాయిలు బాధపడే సమస్యలలో ఇది కూడా ఒకటి. ప్రతి అమ్మాయికి శరీరం పైన ఉండే అవాంఛిత రోమాలతో ఇబ్బందికరంగానే ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తొలగించుకోవడానికి ప్రతి రోజు రేసర్లు క్రీమ్స్ వ్యాక్సింగ్ వంటివి చాలా అవసరం అవుతూ ఉంటాయి. ప్రస్తుత లాక్ డౌన్  టైంలో బయటికి వెళ్లి పార్లర్ల చుట్టూ తిరిగలేము  కాబట్టి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీతో పాటు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతుంటే మీ అవాంఛిత రోమాలు శాశ్వతంగా తొలగించుకోవచ్చు.

అవాంఛిత రోమాలు(Unwanted Hair) తొలగించే హోమ్ రెమిడి తయారీ విధానం.

ముందుగా ఒక బౌల్ తీసుకోండి. తరువాత తెల్లగా ఉండే ఏదేని టూత్ పేస్ట్ ను మీరు రోజు బ్రెష్ చేసుకోవడానికి ఎంతయితే పేస్ట్ తీసుకుంటారో ఎంత మోతాదులో ఈ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో కి ఒక పావు స్పూను బేకింగ్ సోడా ని ఇందులో కి కలపండి. తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉంటె నీటిని పోసి మూడింటిని బాగా కలపండి.

రెమిడి  ఎలా వాడాలి?

ఒక కాటన్ బాల్ ని తీసుకుని మీకు ఏ ప్రదేశం లో అయితే అవాంఛితరోమాలు ఉన్నాయో ఆ ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత కనీసం రెండు నిమిషాల పాటు ఈ మిశ్రమం మీ శరీరంలోకి ఇంకిపోయే వరకు చేతులతో బాగా మసాజ్ చేసుకోండి. తర్వాత పది నుండి పదిహేను నిమిషాలు అలాగే ఉంచి ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీటితో మీ చర్మాన్ని శుభ్రంగా కడిగి చేసుకోండి. ఈ విధంగా మీరు రెండు నుంచి మూడు రోజులపాటు చేస్తూ ఉంటే మీ అవాంఛిత రోమాలు రాలిపోవడాన్ని మీరే గమనిస్తారు.

టూత్ పేస్ట్ మన చర్మం మీద పేర్కొన్న మృతకణాలను తొలగించి ఆ ప్రదేశంలో బ్యాక్టీరియాను నివారించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. బేకింగ్ సోడా శరీరంపై ఉండే నలుపు ను తగ్గించి డెడ్ స్కిన్ సెల్స్ ను కూడా తొలగిస్తుంది. అంతే కాకుండా ఇది ఒక క్లెన్సర్లా గా కూడా పనిచేస్తుంది. అవాంఛితరోమాలు ఉన్న ప్రదేశంలో సహజసిద్ధంగా ఓడిపోయేలా ఈ బేకింగ్ సోడా పనిచేస్తుంది.

ఈ టిప్స్ ని కూడా పాటించండి

మీ అవాంఛిత రోమాలను తొలగించే ముందు మీ చర్మంపై ఉండే మృతకణాలను ఖచ్చితంగా తొలగించుకోవాలి. దీంతో మీ చర్మ రంద్రాలు శుభ్రపడతాయి. కావున మీరు పై రెమిడీను ఉపయోగించే ముందు మీ చర్మాన్ని ఖచ్చితంగా స్క్రబ్ ను ఉపయోగించి శుభ్రం చేసుకోండి. దీంతో మీ అవాంఛిత రోమాలు తొలగించడం సులువవుతుంది.

ఈ రెమిడిని వాడిన తర్వాత ఆ ప్రాంతంలో తప్పప్పకుండా ఏదేని మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల నీకు ఎటువంటి ఎలర్జీ చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఎదురుకాకుండా ఉంటుంది.

అవాంఛిత రోమాలతో ఎక్కువగా బాధపడేవారు ప్రతిరోజు రెండు కప్పుల పుదీనా రసం తప్పకుండా తీసుకోండి. పుదీనా ఆకులతో తయారు చేసిన టీ మహిళల్లో ముఖం మీద పెరిగే అవాంఛిత రోమాలు నిర్మూలించడానికి బాగా పనిచేస్తుందని పరిశోధనలలో రుజువైంది. పురుషులు మీసాలు గడ్డలు రావడానికి ముఖ్యమైన కారణం టెస్టోస్టిరాన్. ఈ హార్మోన్  కొంతమంది మహిళలలో కొన్ని కారణాల వల్ల ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది ఫలితంగానే ముఖంమీద అలాగే శరీరంలోని మిగతా ప్రదేశాలలో అవాంఛిత రోమాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.

పుదినలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ను తగ్గించే గుణాలున్నాయి. పుదీనా రసం తీసుకోవడం మూలంగా మీ అవాంఛిత రోమాలు తొలగిపోవడమే కాదు వాంతులు వికారంగా ఉండటం, జీర్ణ శక్తి లోపించడం, జలుబు, సైనసైటిస్ వంటి సమస్యలు తొలగించడానికి  పుదీనా ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది.ఇలాంటి మరిన్ని ఆరోగ్య కరమైన విషయాలు తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.

Leave a Comment

Scroll back to top
error: Content is protected !!