జుట్టు రాలిపోవడం వలన సన్నగా అయిపోయి, పాపిటలో జుట్టు పలచబడటం వలన బాధపడుతుంటే మన ఇంట్లో ఉండే ఒక పదార్థం ఎటువంటి ఖర్చు లేకుండా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. ఆ పదార్థం ఏంటి అంటే బియ్యం కడిగిన నీళ్లు.
ఇవి జుట్టు పెరగడానికి చాలా బాగా సహాయపడుతాయి. జుట్టు సమస్యలను తగ్గించి జుట్టు పొడవుగా, ఒత్తుగా, మెరుస్తూ ఉండేలా చెయ్యగలవు అంటే నమ్మ లేకపోవచ్చు. కానీ దీన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వారు నిజమని చెబుతున్నారు.
బియ్యం కడిగిన నీళ్లు జుట్టు పెరగడానికి సహాయపడుతుందని వాళ్ళు చెబుతున్నారు. ఈ నీటిని తలకు ఎలా వాడాలో దీని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక కప్పు బియ్యం తీసుకోవాలి.
వీటిని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు నీటితో కడిగి మూడవ సారి మనం తాగే నీటిని అందులో వేసి నానబెట్టాలి. ఇలా కనీసం 24 గంటల పాటు నానబెట్టడం వలన ఇవి పులిసి ఇందులో పెరిగే ఈస్ట్ జుట్టు పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది.
ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ నీటిని తలస్నానం చేసిన శుభ్రమైన జుట్టుకి స్ప్రే చేసుకోవాలి. పులియబెట్టిన బియ్యం నీటిని క్రమం తప్పకుండా జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు యొక్క పిహెచ్ స్థాయిని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. జుట్టుకు ధృఢత్వం పెరుగుతుంది.
పులియబెట్టిన బియ్యం నీరు విటమిన్ ఇ యొక్క గొప్ప వనరు, ఇది దెబ్బతిన్న జుట్టును మృదువైన, సిల్కీగా మార్చడానికి మరియు జుట్టు రాలడాన్ని నివారించడానికి బాగా ప్రసిద్ది చెందింది. ఇందులో ఉన్న అమైనో ఆమ్లాలు జుట్టు పునరుత్పత్తికి సహాయపడతాయి మరియు మీ జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడతాయి.
అదనంగా, ఇందులో విటమిన్లు బి, సి మరియు ఇ ఉన్నాయి, ఇవి జుట్టు పెరుగుదలకు మరింత సహాయపడతాయి. మీ జుట్టును ఆరిన తర్వాత షాంపూ లేకుండా కడగాలి. ఇలా వాడిన తర్వాత జుట్టు వృద్ధికి చాలా బాగా సహాయపడుతుంది. మరియు ఇలా క్రమం తప్పకుండా వాడడంవలన జుట్టు సమస్యలు తగ్గి ఒత్తైన, ధృడమైన జుట్టు పెరుగుతుంది.