rice water for hair regrowth

బియ్యపు కడుగు నీళ్లతో జుట్టు పెరుగుదల నిజమేనా?? షాకింగ్ నిజాలు చూడండి

ప్రతిరోజు అందరి ఆహారంలో తప్పక ఉండే పదార్థం అన్నం. తెలుగు రాష్ట్రాల్లో అన్నం ముఖ్యమైనది. రోజు అన్నం వండటానికి బియ్యం కడిగి ఆ నీళ్లు పారేసి అన్నాన్ని వండేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగిపోతోంది. బియ్యం కడిగిన నీళ్లతో కూడా బోలెడు ఆరోగ్యం అంటున్నారు. ముఖ్యంగా ఇప్పటి కాలంలో చుండ్రు, జుట్టు రాలిపోవడం, జుట్టు నిర్జీవంగా తయారవడం ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి ఎటు చూసినా. అయితే వాటికి మనం పారబోసే బియ్యపు నీళ్లే మంచి ఔషధం గా పని చేస్తాయంటే ఆశ్చర్యం వేస్తుంది.

◆ జుట్టు ఎంత ఒత్తుగా ఉన్నా పొడిబారి ఉంటే నిర్జీవంగా  టెంకాయ పీచులా అనిపిస్తుంది. అలాంటి సమస్య బాధిస్తున్నపుడు బియ్యం కడిగిన నీరు చాలా అద్భుతంగా పని చేస్తుంది.  బియ్యం కడిగిన నీటిలో విటమిన్-బి, విటమిన్- సి, విటమిన్-ఈ, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నీటిని జుట్టుకు పట్టించి ఒక అరగంట తరువాత శుభ్రపరుచుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు తేమను సంతరించుకుని పొడిబారడం తగ్గుతుంది.

◆ బియ్యం కడిగిన నీటిలో కార్బోహైడ్రేట్లు దాతువులు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు ఒత్తుగా పెరగడానికి మరియు రంగు తగ్గకుండా ఉండటానికి తోడ్పడతాయి. 

Rice water for Hair Growth

◆గుప్పెడు బియ్యంలో కొన్ని నీళ్లు వేసి రాత్రంతా అలాగే ఉంచి తరువాత మరుసటిరోజు ఆ నీటిని జుట్టుకు పట్టించి మర్దనా చేయాలి. ఒక గంట తరువాత తల స్నానం చేయాలి. దీనివల్ల జుట్టు పట్టు కుచ్చులా తయారవుతుంది మరియు మెరుపు సంతరించుకుంటుంది.

◆ బియ్యం కడిగిన నీటిలో బాక్టీరియా చాలా ఆరోగ్యమంతమైన  సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.  ఇది తలలో చుండ్రు, దురద  లాంటి బాక్ట్రిరియాతో పోరాడి సమస్యలను నివారిస్తుంది.

◆ సాధారణంగా తల స్నానం చేసాక బియ్యపు నీళ్లు తలకు పోసుకోవడం వల్ల సహజ కండీషనర్ గా పని చేస్తుంది.

◆ వారానికి ఒకసారి అయినా క్రమం తప్పకుండా బియ్యపు నీటిని తలకు ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడానికి తోడ్పడుతుంది. 

◆ జుట్టు కుదుళ్లను మరమ్మత్తు చేసి రక్త ప్రసరణను వేగవంతం చేయడం ద్వారా జుట్టు పెరుగుదలలో బియ్యపు నీళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి

◆ సాధారణంగా ఈ పద్దతిలో జుట్టు కోసం ఉపయోగించే వాళ్ళు పాలిష్ చేసిన బియ్యాన్ని వాడుతుంటారు.అయితే పాలిష్ ఎక్కువ లేని రేషన్ రైస్ అయితే మరిన్ని కార్బోహైడ్రేట్స్ ను మరియు విటమిన్ బి3, ఈ లను విడుదల చేస్తుంది ఫలితంగా ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది.

చివరిగా……

జుట్టు పెరుగుదల కోసం మనం వాడే పద్ధతులు ఎన్నో ఉన్నా, సహజమైన పద్ధతులు ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు లేకుండా జుట్టు పెరుగుదల సులువుగా సాధ్యమవుతుంది. కాబట్టి బియ్యపు కడుగు నీళ్లను వృధాగా పోనివ్వకండి. 

1 thought on “బియ్యపు కడుగు నీళ్లతో జుట్టు పెరుగుదల నిజమేనా?? షాకింగ్ నిజాలు చూడండి”

Leave a Comment

error: Content is protected !!