ring worms remedy with bitter gourd

ఎంత భయంకరమైన భరించలేనంత ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా సరే ఇది రెండు రోజులు రాస్తే చాలు. మళ్ళీ మీ వైపు రాదు

చాలామంది చాలా రకాల చర్మ సమస్యలతో బాధపడుతుంటారు.  కొన్ని చర్మ సమస్యలు  ఎన్ని హాస్పిటల్స్ తిరిగిన, ఎన్ని మందులు వాడినా తగ్గవు. ఎన్నో సంవత్సరాల నుండి బాధించే  చర్మ సమస్యలను కూడా ఈ చిన్న చిట్కా ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా ఉపయోగించినట్లయితే ఎంతటి భయంకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయినా సరే తగ్గిపోతాయి. శరీరంపై వచ్చే దద్దుర్లు, ఎర్రటి మచ్చలు, దురద వంటి చర్మ సమస్యలు తగ్గించడంలో ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.

ఈ చిట్కా  తయారు చేసుకోవడానికి మనకు కావలసిన పదార్థాలు కాకరకాయలు, కర్పూరం బిళ్ళలు, కొబ్బరి నూనె. కాకరకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నె తీసుకొని శరీరంపై ఉండే  మచ్చలు, దద్దుర్లు శరీరం మొత్తం ఉంటే ఎక్కువగా కలుపుకోవాలి. ఏదో ఒక చోట మాత్రమే ఉంటే ఒకటి లేదా రెండు స్పూన్ల కాకరకాయ జ్యూస్ ను వేసుకొని దానిలో నాలుగు  కర్పూరం బిళ్ళలు మెత్తగా పొడిలా చేసి వేసి బాగా కలుపుకోవాలి. మిగిలిన కాకరకాయ పేస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకుని అవసరం ఐనప్పుడు ఉపయోగించుకోవచ్చు.

తర్వాత దీనిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మ సమస్యలు ఉన్న భాగంలో అప్లై చేసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అప్లై చేసిన తర్వాత కనీసం రెండు గంటలపాటు ఆరనివ్వాలి. లేదా రాత్రి పడుకునే ముందు అప్లై చేసి రాత్రంతా అలా వదిలేయాలి. ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. చల్లని నీటితో కడగకూడదు వేడి నీళ్ళు మాత్రమే వాడాలి.  ఈ విధంగా ఐదు రోజుల పాటు చేయాలి. ఈ చిట్కా  పాటించిన రెండవ రోజు నుండే  తేడాను గమనించవచ్చు. 

ఎన్నో సంవత్సరాల నుంచి తగ్గని చర్మ సమస్యలు కూడా ఈ చిట్కా ద్వారా తగ్గిపోతాయి. క్రమం తప్పకుండా ఐదు రోజుల పాటు ఈ చిట్కా పాటించినట్లయితే చర్మవ్యాధులు రమ్మన్నా రావు. మందులు లేదా ఆయింట్మెంట్ లు వాడటం వలన తాత్కాలిక ఉపశమనం  మాత్రమే లభిస్తుంది. శాశ్వత పరిష్కారం లభించదు. ఈ చిట్కా వల్ల ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్  అయినా సరే వెంటనే తగ్గిపోతాయి. ఓపిక ఉంటే ఈ మిశ్రమాన్ని ఉదయం సాయంత్రం కూడా అప్లై చేసుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!