ringworm-home-remedy-skin-etching

100% Result తోడలు, గజ్జల్లో వచ్చే గజ్జి, తామర, దురద 2 నిమిషాల్లో మాయం Ringworm remedy, skin etching

ఇప్పటికాలంలో అందరికీ కలిగే ఒత్తిడి, కాలుష్యం వలన అందరూ చర్మ సమస్యలుతో చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అదే మర్మావయవాలలో అయితే ఇంకా సమస్య. ఎందుకంటే దురదను ఆపుకోవడం కూడా కష్టం.  అందరిలోనూ గోకడానికి కూడా ఇబ్బంది పడాలి. అందులోనూ తామర, గజ్జిలాంటి సమస్యలు అయితే అంటువ్యాధులు కావడం వలన త్వరగా మనతోటి వారికి కూడా అంటుకుంటాయి. తామర లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు పిల్లలు, పెద్దల్లో సాధారణంగా వస్తుంది. డాక్టర్లు దగ్గరకు వెళ్ళడానికి కూడా మొహమాటపడేవారయితే మరింత జఠిలంగా మారుతుందీ సమస్య. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి.

గజ్జి, తామర మన జుట్టు, గోర్లు, చర్మంలోని మృతకణాల్లో నివసిస్తు ఉంటుంది. ఇవి చాలా ప్రమాదకరమైనవి కనుక త్వరగా వ్యాపిస్తాయి. దువ్వెనలూ, జుట్టు వలన కూడా ఇతరులకు వ్యాపిస్తుంది. దీనిని తగ్గించడం కోసం మార్కెట్లో దొరికే అనేకరకాల క్రీములు వాడుతుంటారు. వీటిలో ఉండే కెమికల్స్ వలన చర్మంపైన ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇంటివైద్యంతో గజ్జి, తామరను తగ్గించుకోవచ్చు. అదేంటో చూద్దాం. 

రెండు చెంచాల కొబ్బరినూనె తీసుకుని అందులో సుహాగా, టంకణం అని పిలిచే బోరాక్స్ పౌడర్ను ఒక స్పూన్, పూజగదిలో వాడే కర్పూరం నాలుగయిదు పొడిచేసి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపి గజ్జి, తామర, దురద ఉన్నచోట రాత్రిపూట ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఉదయాన్నే చల్లనీటితో లేదా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ మిశ్రమం వలన నాలుగయిదు రోజుల్లోనే మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరినూనె చర్మాన్ని పొడిబారనివ్వదు. తేమగా ఉంచుతుంది. 

బోరాక్స్ పౌడర్ ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. అనేక ఆయుర్వేద వైద్యాలలో దీనిని వాడతారు. గజ్జి, తామరకు కారణమయ్యే  ఫంగస్ను నిర్మూలిస్తుంది. కర్పూరం అనేక ఔషధగుణాలు కలిగి చర్మసమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మంపై ఇన్ఫెక్షన్ వలన కలిగే ఎర్రటి దద్దుర్లు, వాపుని తగ్గిస్తుంది. ముఖ్యంగా అందరిలో వచ్ఛే స్కిన్ ఇన్ఫెక్షన్లు తగ్గడానికి సహాయంచేస్తుంది. ఇలా ఇంట్లో ఉండే పదార్థాలతో చేసే చికిత్సతో మీ చర్మసమస్యలు నుండి ఉపశమనం పొందండి. 

Leave a Comment

error: Content is protected !!