ఆరోగ్యానికి అవసరమైన ఆహారాలలో పండ్లు ప్రధానమైనవి. సీజనల్ వారీగా లభించే పండ్లు బోలెడు వాటిలో సపోటా ఒకటి. తియ్యని రుచిని కలిగి మధురమైన సువాసనను కలిగి ఉండే ఈ పండు బోలెడు ఆరోగ్యప్రయోజనాలు చేకూరుస్తుంది. ఆ ప్రయోజనాలు ఏమిటో చూసేయండి మరి.
విటమిన్ ఎ మరియు సి సమృద్ధిగా ఉంటుంది
రోజుకు ఒక సపోటా తింటే కంటి వైద్యుడికి దూరంగా ఉండవచ్చు, విటమిన్ ఎ మన కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది., ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలిస్తుంది, గుండె రుగ్మతలను నివారిస్తుంది.
శక్తిని అందిస్తుంది
సపోటాలోని సహజ ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్ కంటెంట్ శరీరానికి చాలా శక్తిని ఇస్తాయి. కాబట్టి బిజీగా ఉన్నపుడు బోజనం చేయలేని సందర్భాలలో శరీరానికి కావల్సిన శక్తిని పొందడానికి సపోటాను తీసుకోవడం ఉత్తమం.
యాంటీ ఇన్ఫ్లమేటరీ
సపోటాలో టానిన్ లు అధికంగా ఉంటాయి., ఇవి సహజ శోథ నిరోధక చర్యగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా తినడం వల్ల మంచి ఫలితాలు చూడవచ్చు.
జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది
ఇది జీర్ణవ్యవస్థను అదుపులో ఉంచుతుంది మరియు ప్రేగు సిండ్రోమ్ సమస్యను అరికట్టడంలో దోహాధం చేస్తుంది. ఇందులో ఫైబర్స్ తిన్న ఆహారాన్ని సమర్థవంతంగా జీర్ణమయేలా చేస్తాయి సుఖ విరేచనాన్ని ప్రోత్సహిస్తాయి. అందువల్ల మలబద్ధకం సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్ల మూలం
డైటరీ ఫైబర్, విటమిన్లు ఎ మరియు బి, సి సమృద్ధిగా ఉండటమే కాకుండా, సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. అందువల్ల, నోటి కుహరం క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఎముకలకు మంచిది
ఇందులో కాల్షియం, భాస్వరం మరియు ఇనుము పుష్కలంగా ఉన్నాయి ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో తోడ్పడతాయి. సపోటాను క్రమం తప్పకుండా తీసుకుంటే భవిష్యత్తులో ఎముకలకు సంబందించిమ సమస్యలు రావు. ఇనుము, ఫోలేట్లు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, రాగి, ఫాస్పరస్, సెలీనియం వంటి ఖనిజాల మంచి మూలంగా సపోటాను చెప్పవచ్చు.
రక్తపోటును నియంత్రిస్తుంది
సపోటాలోని మెగ్నీషియం రక్త నాళాల పనితీరును పర్యవేక్షిస్తుంది. అలాగే పొటాషియం రక్తపోటు మరియు ప్రసరణను నియంత్రిస్తుంది. రక్తహీనతతో బాధపడుతున్నవారు సపోటాను తీసుకోవడం శ్రేయస్కరం. ఇందులో ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటుంది.
తల్లులకు మంచిది
ఎలక్ట్రోలైట్స్, విటమిన్ ఎ మరియు కార్బోహైడ్రేట్లతో నిండిన సాపోటా తీసుకోవడం వల్ల పాలిచ్చే తల్లులకు కూడా చాలా మంచిది.
చివరగా……
సపోటా అందరికి అందుబాటులో ఉండే తియ్యని పండు దీన్నీ తీసుకోవడం వల్ల పైన చెప్పుకున్న ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి తప్పకుండా తినడం మొదలుపెట్టండి.