కొన్ని వందల సంవత్సరాలుగా భారతీయుల వైద్యంలో ప్రాచీన ఆనవాళ్లు నిలుపుకున్నది ఆయుర్వేదం. ఆయుర్వేదంలో ఎన్నో గొప్ప ఔషధాలు, మూలికలు ఉంటాయి. అలాంటి మూలికల్లో బ్రాహ్మీ ఒకటి. సరస్వతిగా మనం పిలుచుకునే ఈ బ్రాహ్మీ మెదడు పనితీరు మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెబుతారు. కేవలం మెదడు పనితీరుకే కాదు ఈ సరస్వతి ఆకు వల్ల చాలా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో చూడాల్సిందే.
◆ బ్రాహ్మీ మెదడు పనితీరులో మూడు అంశాలను మెరుగుపరుస్తుంది, ఇందులో దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి, స్వల్పకాలిక జ్ఞాపకశక్తి మరియు అద్భుతమైన జ్ఞాపకశక్తిని నిలుపుకునే సామర్థ్యం ఉన్నాయి. బ్రహ్మి చల్లదనాన్ని కలిగిస్తుంది. ఇది మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చి ఆందోళనలను దూరం చేస్తుంది. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.
◆ మానసిక ఒత్తిడిని పెంచే హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గించడం వల్ల బ్రాహ్మి ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది. మెదడును దెబ్బతీసేందుకు కారణమయ్యే న్యూరాన్‌లో అమిలాయిడ్ సమ్మేళనం ఉండటం వల్ల అల్జీమర్స్ వ్యాధి లక్షణాలను తగ్గించడానికి బ్రహ్మి సహాయపడుతుంది. బ్రహ్మిలో బాకోసైడ్లు అని పిలువబడే బయో కెమికల్ మెదడు కణాలను ప్రభావితం చేయడం ద్వారా కొత్త కణాలను సృష్టించడంలో ఫోహదం చేస్తుంది.
◆ ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తికి కారణమయ్యే మెదడులోని హిప్పోకాంపస్ భాగంపై సానుకూల ప్రభావాన్ని చూపడం ద్వారా ఆలోచనాతీరుపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా చురుగ్గా ఉండగలుగుతారు.
◆ ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్లతో బ్రాహ్మి నిండి ఉంది. యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలలోకి చొచ్చుకువెళ్లి ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బ్రహ్మి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది..
◆ ఆర్థరైటిస్, గౌట్ మరియు ఇతర సమస్యలను ఉపశమనం కలిగించే గొప్ప ఔషద్జంగా బ్రాహ్మీ ని చెప్పుకోవచ్చు. ఇది గ్యాస్ట్రిక్ అల్సర్లను తగ్గించడానికి మరియు ప్రేగు సిండ్రోమ్ చికిత్సకు కూడా సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్న రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బ్రాహ్మి అద్భుతంగా పనిచేస్తుంది. మరియు హైపోగ్లైసీమియా యొక్క లక్షణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
◆ జుట్టు రాలడాన్ని నివారించడానికి బ్రాహ్మి నూనె చాలా బాగుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ గుణాలు రక్తప్రసరణను మెరుగు పరిచి నరాలకు ఉత్తేజితం చేయడం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతే కాకుండా ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరం నుండి అన్ని విషాలను తొలగించడంలో సహాయపడతాయి మరియు కణాల పునరుత్పత్తిని ప్రేరేపించడం ద్వారా చర్మం రంగును పెంచుతాయి. చుండ్రు, దురద మరియు వెంట్రుకలు చివాడు చిట్లడం వంటి సమస్యలను బ్రాహ్మీ తైలం ఉత్తమ ఎంపిక. దీంతో మసాజ్ చేయడం వల్ల మెదడు నరాలు చాలా విశ్రాంతిని పొందుతాయి.
చివరగా…
బ్రహ్మి ఆకులతో (తాజా లేదా పొడి) టీ తయారు చేసుకోవచ్చు, ఇది ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాదు బ్రాహ్మీ ఆకులతో పచ్చడి లాంటి ప్రయోగాలు చేసి ఆహారంలో భాగం చేసుకోవచ్చు. మార్కెట్లలో మాత్రలు లేదా పొడి రూపంలో బ్రాహ్మి మందులు అందుబాటులో ఉన్నాయి, అయితే తాజా ఆకుల వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది కాబట్టి ఈ బ్రహ్మీ తీగను ఇక పెంచడం మొదలుపెట్టండి.