Say Goodbye To Dry Skin With These Tips

పది నిమిషాలు చాలు నల్లని పెదాలు ఎర్రగా మారుతాయి. పగుళ్లు తగ్గి మృదువుగా ఉంటాయి

చలికాలంలో పెదాలు పగిలి క్రాక్స్ ఏర్పడుతూ ఉంటాయి. దీని వలన రక్తం కారడం, నొప్పి వంటి సమస్యలు కూడా ఉంటాయి. చూడటానికి కూడా పెదాలపై చర్మం పైకి లేచి నల్లగా పగుళ్ళతో ఇబ్బందిగా ఉంటాయి. ఇలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి ఇప్పుడు మనం ఒక హోమ్ రెమిడి ప్రయత్నిద్దాం. దీనివలన సహజంగా గులాబీ రంగులోకి మారడంతో పాటు పెదాల పగుళ్ళు తగ్గుతాయి. లిప్స్కిక్ అవసరం లేకుండానే పెదాలు ఎర్రగా మారుతాయి. దీనికోసం మనం ఒక బీట్రూట్ తీసుకోవాలి. బీట్ రూట్ లో ఉండే సహజమైన రంగు పెదాలు ఎర్రగా మార్చడంలో, తాజాగా ఉండటంలో సహాయపడుతుంది. బీట్రూట్ను పైన పొట్టు తీసేసి మెత్తగా తురుముకోవాలి లేదా మిక్సీ పట్టుకోవాలి.

 మూడు స్పూన్లు బీట్రూట్ రసాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయాలి. ఈ రెండింటినీ బాగా కలిపి మూడు నిమిషాలు ఫ్రిజ్లో పెట్టాలి. ఫ్రిజ్ లో పెట్టడం వలన కొబ్బరినూనె గడ్డకడుతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలిపి దీనిలో ఒక స్పూన్ పెట్రోలియం జెల్లీ వేసుకోవాలి. పెదాలను మృదువుగా ఉంచడంలో పెట్రోలియం జెల్లీ సహాయపడుతుంది. చలికి తేమను కోల్పోకుండా అడ్డుకుంటుంది. తర్వాత 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా వేయాలి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ అందుబాటులో లేనివారు ఆల్మండ్ ఆయిల్ ఒక స్పూన్ వేసుకోవచ్చు. బాదం ఆయిల్ లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. 

తరువాత వీటన్నింటినీ బాగా కలిపితే ఇది మంచి క్రీమ్లా తయారవుతుంది. దీనిని ఏదైనా చిన్న బాక్స్ లో నిల్వచేసుకొని వాడుకోవాలి. దీని కంటే ముందు చేసి పెదాలపై ఉండే మృతకణాలు తొలగించుకోవాలి. దానికోసం ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ హనీ, కొద్దిగా నిమ్మరసం కలిపి పెదాలపై నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది. కొత్త చర్మం మంచి రంగులో ఉండటానికి మనం తయారుచేసి పెట్టుకున్న లిప్ బామ్ అప్లై చేయాలి. ఈ లిప్ బామ్ సహజంగా రంగుని అందించడంతో పాటు పెదాలను తాజాగా, ఎటువంటి పగుళ్ళు లేకుండా కాపాడుతుంది.

Leave a Comment

error: Content is protected !!