ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య నడుంనొప్పి. ఈ నడుము నొప్పి అనేది ఎక్కువగా కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేసుకునే వారితో మొదలై అధిక బరువు కలిగి ఉండటం, బైక్ లపై ఎక్కువ దూరం ప్రయాణాలు చేయడం, ఇతర అనారోగ్య సమస్యలు, వంశపార్యపరమైన సమస్యగా రావడం, తీసుకునే ఆహారంలో వాతాన్ని కలిగించే పదార్థాలు అధికంగా ఉండటం వంటి సమస్యల వల్ల నడుము, పిరుదుల భాగంలో పట్టుకుపోయినట్టు అనిపించడంతో మొదలై, అక్కడి నుండి తొడలు, తొడ కండరాలు మోకాళ్ళు, పాదాలు ఇలా క్రమంగా పాకుతూ పోతుంది. ముఖ్యంగా చలికాలంలో దీని తీవ్రత అధికంగా ఉంటుంది. నడుము భాగంలో ఉండే వెన్నుపూసల మధ్యగా ఉన్న సయాటికా నరం మీద ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల వచ్చే ఈ నొప్పిని సయాటికా అని పిలుచుకుంటాం. అయితే ఈ సమస్య ను నివారించడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి అవేంటో చూద్దాం మరి.
◆ నడుము, పిరుదులు, తొడలు, పిక్కలు, పాదాలు పట్టుకుపోయి ఒళ్ళంతా చెమట పడుతూ నడవడానికి కూడా వీలుకాని పరిస్థితిని తెచ్చిపెట్టే సయాటికా వల్ల తొడలోని కీలు పట్టుకుపోయి, నరంలాగుతూ విపరీతమైన బాధ కలుగుతుంది. ఆయుర్వేదంలో దీనిని గృధసీవాతము అంటారు.
◆వెల్లుల్లి పాయలు 320 గ్రాముల మోతాదులో తీసుకుని మెత్తగా దంచి అందులో నాలుగు లీటర్ల పాలు, నాలుగు లీటర్ల మంచి నీళ్ళు కలిపి, వెల్లుల్లి కలిసేలా బాగా పిసికి పొయ్యి మీద పెట్టి నీళ్లు ఇగిరిపోయి నాలుగు లీటర్ల పాలు మిగిలేలా మరిగించాలి. తరువాత దీనిని పలుచని వస్త్రంలో వడగట్టుకోవాలి. ఈ కషాయాన్ని పూటకు ఒకటి లేదా రెండు ఔన్స్ ల మోతాదుగా సేవిస్తూ ఉంటే క్రమంగా సయాటికా వాతం తగ్గిపోతుంది.
◆ సాధారణంగా లేత ఆకులు ఉన్న వేప చెట్టు కాకుండా, పెద్దపెద్ద ఆకులతో ముదిరిన వేపమానుకు గాట్లు పెడితే దానికి జిగురు వస్తుంది. ఈ జిగురు సేకరించుకుని పూటకు రెండు గ్రాముల మోతాదుగా రెండు పూటలా కొంచం నీళ్లలో కలిపి కరిగించి తాగుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే సయాటికా నొప్పి త్వరగా తగ్గుతుంది.
◆ గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా పెరిగే చెట్టు వావిలిచెట్టు. ఈ వావిలి చెట్టు ఆకులను 20 గ్రాముల మోతాదుగా తీసుకుని దంచి, పావు లీటరు నీళ్లలో వేసి పొయ్యి మీద పెట్టి, చిన్న మంట మీద సగం నీళ్లు మిగిలేలా మరగబెట్టి వడపోసి చల్లార్చి, పూటకొక మోతాదుగా రెండు పూటలా తాగుతూ ఉంటే. వారం నుండి పది రోజులలో సయాటికా నొప్పి, దానికి కారణమయ్యే వాతం రెండూ తగ్గిపోతాయి.
◆ ప్రస్తుతం గుగ్గిలం అనే పేరు చాలామందికి తెలియకపోవచ్చు. శుద్దిచేసిన గుగ్గిలం 50గ్రాములు, వెల్లుల్లి పాయలు 10 గ్రాములు కలిపి కొంచం నేతితో కలిపి బాగా దంచి ముద్దగా చేసి, రేగు పండు పరిమాణంలో మాత్రలు తయారు చేయాలి. వీటిని పూటకు ఒక మాత్ర చెప్పున రెండు పూటలా మంచినీళ్ళతో వేసుకుంటూ ఉంటే సయాటికా నొప్పులు తగ్గిపోతాయి.
చివరగా…..
సయాటికా సమస్య వచ్చినపుడు కేవలం చిట్కాలు, ఔషధాలు మాత్రమే కాకుండా సయాటికా నరాన్ని ఒత్తిడికి గురిచేయకుండా ఉండేలా జాగ్రత్తలు పాటిస్తూ, తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉంటే సమస్య తగ్గిపోతుంది.
మంచి సమాచారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు
Tree plant image pettandi sir