Science-Based Health Benefits of Almond Milk

ఏడు రోజులు పాలలో కలిపి తినండి వందేళ్ల పాటు కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు రక్తహీనత మీ దరి చేరవు

ఒకప్పుడు మన పెద్దలు తినే ఆహారం ఎంతో బలమైనది. ఇప్పటి మారిపోతున్న ఆహారపుటలవాట్లు 30 దాటకుండానే కీళ్ళ మధ్య ద్రవం కరిగిపోయి కాళ్ళు, కీళ్ళ మధ్య నొప్పి, నడుస్తున్నప్పుడు కణకణ మని శబ్దం వస్తూ ఉంటుంది. ఒకప్పుడు ముసలి వారు కూడా చాలా చురుకుగా తిరిగేవారు. కానీ నేడు చిన్న వయసులోనే కీళ్ల నొప్పులకు ఆపరేషన్లు, విపరీతమైన మందులు వాడవలసిన అవసరం వస్తుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి మనం ఇంట్లో ఈ 2 చిట్కాలు పాటించడం వలన నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.

 మన ఆహారంలో కీళ్ల మధ్య ద్రవాన్ని పెంచే బెండకాయ వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే క్యాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పాల పదార్థాలు తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవాలి. పొట్టు తీసిన నువ్వులు ముఖ్యంగా కాల్షియంతో సహా ఎముకల ఆరోగ్యానికి కీలకమైన పోషకాలలో సమృద్ధిగా ఉంటాయి.  నువ్వులను నానబెట్టడం, కాల్చడం లేదా మొలకెత్తడం వల్ల ఈ ఖనిజాల శోషణ మెరుగుపడుతుంది.

 కాల్షియం: 22% RDI, మెగ్నీషియం: 25% RDI,

 జింక్: 21% RDI, మాంగనీస్: 32% RDI నువ్వులలో పుష్కలంగా లభిస్తాయి. 

ఒక కప్పు నువ్వులను తీసుకొని దోరగా వేయించి మిక్సీ లో మెత్తగా పొడిలా చేసుకోవాలి. ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నువ్వుల పొడి కలుపుకొని తాగడం వలన శరీరానికి కాల్షియం పుష్కలంగా అందుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే ప్రతిరోజు రాత్రి నాలుగు బాదం పప్పులను నానబెట్టి ఉదయాన్నే పైన పొట్టు తీసేసి వీటిని నమిలి పాలను తాగడం వలన కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇలా తాగలేకపోతే బాదంపప్పులను మెత్తని పొడిగా చేసుకొని పాలలో వేసుకొని ఒక స్పూన్ పొడి పటికతో కలిపి తాగడం వలన కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒక చిట్కా పాటించడం వలన కీళ్ల నొప్పులు వెన్నునొప్పులు నుండి ఉపశమనం పొంది ఆరోగ్యంగా చురుకుగా ఉండవచ్చు.

Leave a Comment

error: Content is protected !!