దగ్గు విపరీతంగా వస్తున్నప్పుడు కడుపంతా నొప్పిగా మారి చాలా ఇబ్బంది పడుతుంటాం. దగ్గుకి అసలుకారణం కఫం. కఫం పలుచగా ఉన్నప్పుడు దగ్గితే సులభంగా బయటకు వచ్చేస్తుంది. పలచగా ఉండే కఫం చిక్కబడి ముద్దలు ముద్దలుగా మారాక చాలా ఇబ్బందిపెడుతుంది. ఇది బయటకు రాదు. దగ్గు తగ్గదు. అసలు దగ్గుకి మందులు వాడే బదులు కఫం తగ్గడానికి వాడితే త్వరగా ఉపశమనం లభిస్తుంది. దానికోసం ఇంటిచిట్కాలను కూడా పాటించవచ్చు. అవేంటో చూద్దాం.
కఫాన్ని కలిగించడానికి ఆవిరిపట్టడం మంచి పరిష్కారం. ఆవిరి పట్టడానికి ఇప్పుడు చెప్పబోయే నూనెను వాడితే త్వరగా కఫాన్ని కరిగించొచ్చు. దానికోసం కొబ్బరినూనె 6ml, పుదీనా నూనె1ml, యూకలిప్టస్ ఆయిల్ 1ml, ఎక్కడయినా జాయింట్, కీళ్ళనొప్పులు ఏర్పడినపుడులవంగం ఆయిల్ 1ml, దాల్చిన చెక్క1ml నూనెలు తీసుకోవాలి.
వీటిని మంచిగా కలిపి ఎయిర్ టైట్ బాటిల్ లో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెలలో కొబ్బరినూనె తప్ప మిగతా నూనెలన్నీ ఘాటైన వాసన కలిగినవి మరియు ఎన్నో ఆయుర్వేద ఔషధగుణాలు కలిగినవి. వీటిని కొబ్బరినూనె లో కలపడం వలన అన్నీ బాగా కలుస్తాయి.
తర్వాత ఈ నూనెను ఒకచుక్క ఆవిరిపట్టే నీటిలో వేసి ఆవిరిపట్టాలి. ఈ మిశ్రమంలోని గుణాలన్ని త్వరగా కఫాన్ని కరిగించి దగ్గుని తగ్గిస్తాయి. ముక్కులో పేరుకున్న కఫాన్ని లూజ్ చేసి బయటకు వెళ్ళిపోయేలా చేస్తుంది. మరియు వాసన కోల్పోయిన ముక్కుకు ఉత్తేజాన్ని అందిస్తుంది. ముక్కులో కఫం నిల్వ ఉండండం వలనే బ్లాక్ ఫంగస్ ఉండడానికి కూడా కారణం అవవచ్చు.
అలాగే ఈ మందు శరీరంలో ఇన్ఫెక్షన్ లు తగ్గిస్తుంది. ఈ నూనెను జాయింట్, కీళ్ళనొప్పులు ఉన్నచోట మంచి ఫలితం ఉంటుంది మరియు తక్కువ సమయంలో పరిష్కారం లభిస్తుంది. ఈ నూనెలను ఎక్కువ మోతాదులో వాడకూడదు. ఒకటి లేదా రెండు చుక్కలు మందును మాత్రమే వాడాలి. ఇలా తరుచూ ఆవిరి పట్టడం వలన ఉపశమనం కలిగించడంతో పాటు మోతాదు మించితే ఊపిరితిత్తులు సమస్యల బారినపడతారు. ఈ నూనెలను కూడా పరిమితికి మించి వాడకూడదు. గర్భిణులు, శ్వాస కోశ వ్యాధులు ఉన్నవారు ఈ నూనెను వాడకపోవడమే మంచిది.