మనం రోజువారీ వంటల్లో కానీ, స్వీట్స్లో కానీ, పాలల్లో కానీ, జ్యూస్లో కానీ పంచదార ముఖ్యంగా వాడతాం. తర్వాత స్థానంలో బెల్లం వాడతాం. ఈమధ్య తాటిబెల్లం కూడా వాడతున్నాం. వీటివలన అనేక సమస్యలు వస్తుంటాయి. దంతాల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చెడ్డ బాక్టీరియా ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతుంటాయి. ఇమ్యునిటీ బాగా తగ్గిపోతుంది. గొంతు ఇన్ఫెక్షన్లు, టాన్సిల్స్ లాంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. కఫం, దగ్గు, శ్లేష్మం పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగి షుగర్ లేనివారికి కూడా వచ్చే అవకాశం ఉంది. ట్రైగ్లిజరాయిడ్స్, కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం పంచదార, బెల్లాలకు పెరుగుతుంది.
ఇన్ని అనార్థాలు ఒబెసిటీకి చక్కెర కారణం. అందరికీ తీపంటే ఇష్టం. కానీ ప్రమాదం లేని వాడాలని నాచురోపతిలో చెప్పబడింది. బెల్లాన్ని కూడా చాలా తక్కువగా వాడండి. తీపి కావాలనిపించినపుడు తేనె వాడుకోవాలి, ఎండుఖర్జూరం కూడా వాడుకోవచ్చు. ఎండుఖర్జూరం పొడిని వాడుకోవచ్చు. ఈ మూడింటిని పాలలో, స్వీట్లలో వాడుకోవాలి. ఇవన్నీ ఇంతకుముందు విన్నవే. కానీ ప్రకృతి ప్రసాదించిన వాటిలో ఇంకో తీపి పదార్థం ఉంది. ఆయుర్వేదంలో ఎక్కువగా వినేదీ ఇది ప్రకృతి అందించినది అదే అతిమధురం. లికోరైస్ వేర్లు ఇవి. ఈ వేళ్ళపొడిని మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. సుమారు వందగ్రాముల నలభై రూపాయలు ఉంటుంది. కేజీ మూడొందలు నుండి నాలుగొందలు ఉండొచ్చు. అతిమధురం ఆహారంలో ఎలా వాడాలి.
డయాబెటిస్ ఉన్నవారు కాఫీ, టీలలో చక్కెర మానేస్తారు. అతిమధురం చిటికెడు వేసుకుంటే నోటికి తియ్యగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచుతుందని నిరూపితమయింది. ఇది కొంచెం కొంచెం వాడటం వలన, జ్యూస్ లో అరస్పూన్ వేసుకుంటే చాలు. వేడిచేసినపుడు మజ్జిగ లో అరస్పూన్ అతిమధురం కలుపుకున్నా శరీరానికి చలవచేస్తుంది.పిల్లలకు పాలిచ్చే వారీలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండటంవలన పిల్లలకు కూడా ఇవ్వొచ్చు. మన ఆహారం లో తీపికోసం ఇది వాడుకోవచ్చు. సలాడ్స్లో కూడా పైన చల్లుకుని వేసుకోవచ్చు.
పంచదార, బెల్లాన్ని కి బదులుగా అతిమధురం చక్కగా వాడుకోవచ్చు. రోజుకు నాలుగు ఐదు స్పూన్లు వాడినా ప్రమాదమేమీ లేదు. కఫము, దగ్గు, శ్లేష్మాలు, పిల్లికూతలు, బ్రాంకైటీస్తో బాధపడేవారికి పంచదార బెల్లం వాడితే అవి తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. అతిమధురం వలన ఈ ఇబ్బంది ఉండదు. పరిశోధనల వలన అతిమధురం ఆరోగ్యానికి మంచిదని తేలింది. ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే తీపివాటికోసం , తినాలనిపించినపుడు పావుస్పూన్ అలా వాడుకోవచ్చు. హెర్బల్ టీలలో కూడా వేసుకోవచ్చు. గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. ప్రకృ ఇచ్చిన అతిమధురం వాడి ఆరోగ్యాన్ని రక్షించుకుందాం .ఏమంటారు. మీరు కూడా ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు.
మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి