వయసు పైబడుతున్న కొద్ది కాల్షియం లోపం ఎక్కువవుతుంది. దీనివలన కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల వలన, ఆహారపు అలవాట్ల వలన వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి కాల్షియం లోపం, విటమిన్స్ లోపం వస్తుంది. క్యాల్షియం, విటమిన్స్ లోపించడం వల్ల నీరసం, ఆయాసం, ఒళ్ళు నొప్పులు, నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పి, జుట్టు రాలడం, బలహీనత వంటి సమస్యలు వస్తున్నాయి.
ఈ సమస్యను తగ్గించు కోవడం కోసం ఇంగ్లీష్ మందులు వాడనవసరం లేకుండా, హాస్పిటల్ కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ లోపాలను తగ్గించుకోవచ్చు. కావలసిన పదార్ధాలు గసగసాలు ప్రతి ఒక్కరి వంటగదిలో ఎక్కువగా ఉంటాయి. గసగసాలు వేసి వుండేలా ప్రతి కూర చాలా రుచిగా ఉంటుంది. గసాల కూర గురించి ఇవ్వడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. గసగసాలు తీసుకోవడం వల్ల కాల్షియం లోపం తగ్గుతుంది.
మోకాలు నొప్పి మెడ నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. తర్వాత కావలసిన పదార్థం సొంపు. సోంపు కూడా క్యాల్షియం, విటమిన్, ఐరన్, మెగ్నీషియం వంటి వాటిని కలిగి ఉంటుంది. సోంపు తీసుకోవడం వలన శరీరంలో అనేక నొప్పులు తగ్గడమే కాకుండా మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. మూడవ పదార్థం పటిక బెల్లం. పటిక బెల్లం తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నాలుగో పదార్థం ఎండుకొబ్బరి. ఎండుకొబ్బరి కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
స్టౌ మీద గిన్నె పెట్టి అందులో ఒక చెంచా నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఒక చెంచా గసగసాలు వేసుకోవాలి. గసగసాలు మాడిపోకుండా ముందుగా ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి. పెద్ద వాళ్ళు అయితే కొవ్వు తీసిన పాలును ఉపయోగించాలి. పిల్లలకు ఏ పాలు ఇచ్చిన పర్వాలేదు. తర్వాత ఈ పాలలో ఒక చెంచా సోంపు, రుచికి సరిపడినంత పటిక బెల్లం వేసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు పటికబెల్లం వేసుకోకూడదు. చిన్నది ఎండుకొబ్బరి ముక్క వేసుకోవాలి.
కొబ్బరి ముక్క వద్దు అనుకున్నవారు పొడిగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఐదు నుంచి పదినిమిషాల పాటు పాలను మరిగించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ముందు కొబ్బరి ముక్క తిని తర్వాత పాలను తాగాలి. వారానికి మూడుసార్లు ఉంటే రోజు విడిచి రోజు ఈ విధంగా తయారు చేసుకొని తాగడం వలన శరీరానికి కాల్షియం లోపం, మెగ్నీషియం, పొటాషియం వంటివి లభిస్తాయి. శరీరం లో నీరసం అలసట, మోకాలు నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.