saymiyaa lemon pulihora prepare in telugu

సేమియా నిమ్మకాయ పులిహోర ఈ టిప్స్ తో చెయ్యండి. పొడి పొడిగా భలే రుచిగా ఉంటుంది seymiyaa lemon pulihora

కరోనా వచ్చిన తర్వాత పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. హడావిడిగా తిని పరిగెత్తే పిల్లలకు తినే వాటిని ఆస్వాదించే అవకాశం చిక్కింది. వాళ్ళకోసం పూటపూటకి కొత్త వెరైటీలకోసం తల్లులకు హైరానా తప్పడంంలేదు. ఇడ్లీ, దోశ బోర్ కొట్టేసి కొత్త రుచులను అడుగుతున్న పిల్లలకోసం ఇప్పుడు నేను చెబుతున్న చిట్కాలతో సేమ్యా పులిహోర ప్రయత్నించి చూడండి. పొడిపొడిగా ఉండి కొంచెం పులుపుగా ,కమ్మగా ఉండే ఈ సేమ్యా పులిహోర మీ పిల్లలకు తప్పక నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా సేమ్యా పులిహోర ఎలా చేయాలో తెలుసుకుందామా.

కావలసిన పదార్థాలు:- 1కప్పు సేమ్యా, పసుపు, సాల్ట్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, తాలింపు దినుసులు, కరివేపాకు, పల్లీలు, జీడిపప్పు, ఒక నిమ్మచెక్క.

సేమ్యాపులిహోర తయారీవిధానం కోసం ఈ వీడియో చూడండి.

తయారీవిధానం:- స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి.  అందులో అరలీటర్ నీటిని వేసి అది బాగా మరిగాక అందులో పావు టీస్పూను పసుపు వేయాలి. అలాగే పావు టీస్పూన్ ఉప్పు వేసుకొని తర్వాత కప్పు సేమ్యా కూడా వేసుకోవాలి.ఒకసారి సేమ్యాని కలుపుకోవాలి. ఇలా ఉడికించేటపుడు పసుపు వేయడం వలన మంచి రంగు వచ్చి పులిహోర చూడడానికి చాలా బాగుంటుంది. రెండునిమిషాలు ఉడికిన తర్వాత సేమ్యాను పట్టుకుని చూసుకోవాలి. సేమ్యా సగం ఉడికితే చాలు. తర్వాత స్టవ్ ఆపేసి సేమ్యాను వడకట్టుకోవాలి. ఇలా వడకట్టిన సేమ్యాలో కొంచెం చల్లని నీళ్ళను పోయడం వలన సేమ్యా అంటుకోకుండా పొడిపొడిగా వస్తుంది. నీళ్ళు మొత్తం పోయాక ఒక ప్లేట్ లోనికి తీసుకుని సేమ్యాను ఆరబెట్టుకొని చల్లార్చుకోవాలి.

ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని తాలింపుకు తయారు చేసుకోవచ్చు. గిన్నెలో రెండు చెంచాల నూనె వేసుకుని అందులో ఒక టీస్పూన్ శనగపప్పు, ఒక టీస్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, పావు టీస్పూన్ జీలకర్ర, పల్లీలు  వేసుకుని మీడియం మంటలో వేయించుకోవాలి. ఇందులోనే జీడిపప్పు, నిలువుగా కోసిన పచ్చిమిర్చి, కరివేపాకు,ఎండుమిర్చి కూడా వేసి సేమ్యాకు సరిపడేంత ఉప్పుని కూడా వేసుకోవాలి. కొంచెం తాలింపు వేగాక ఉడికించి చల్లార్చిన సేమ్యాని వేసుకొని  తాలింపు సేమ్యాకు పట్టేవిధంగా కలుపుకోవాలి. తాలింపు కలిసాక స్టవ్ ఆపేసి కొంచెం సేమ్యా చల్లారిన తర్వాత ఒక నిమ్మచెక్క పిండుకొని మొత్తం కలుపుకోవాలి. చివరగా కొంచెం కొత్తిమీర తురుము చల్లుకుంటే రుచికరమైన సేమ్యా పులిహోర తయారయిపోతుంది

ఈ వంటకాన్ని ఉదయం టిఫిన్గా లేదా ఈవినింగ్ స్నాక్గా కానీ లేదా రాత్రిపూట టిఫిన్ గా తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మీరు కూడా ఈ చిట్కాలతో సేమ్యా పులిహోర తయారుచేసి రుచిచూడండి మరి.

Leave a Comment

error: Content is protected !!