Shampoo For Hair Fall and Hair Growth in Telugu

ఇది షాంపుతో కలిపితే చాలు జుట్టు రాలకుండా పొడుగౌతుంది

మనం తలకి షాంపు యూస్ చేస్తున్నప్పుడు అది నేరుగా తలకు అప్లై చేయకూడదు. దానిలో కొన్ని రకాల పదార్థాలు కలిపి చేయడం వల్ల తల శుభ్రపడటంతో పాటు కొన్ని రకాల జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎక్కువగా కెమికల్ బేస్డ్ హెయిర్ షాంపూలు ఉపయోగిస్తుంటారు. వీటి వలన తల శుభ్ర పడటం జరుగుతుంది. కానీ కాలక్రమంలో జుట్టు సమస్యలు అనేకం వస్తాయి.

 ముఖ్యంగా జుట్టు రాలిపోవడం, జుట్టు కణాలు దెబ్బతిని జుట్టు విరగడం వంటి అనేక రకాల సమస్యలను మనం గమనిస్తూ ఉంటాం. అందరికీ హెర్బల్ హెయిర్ షాంపూలు అందుబాటులో ఉండక పోవచ్చు లేదా పడకపోవచ్చు. కానీ మనం వాడే షాంపూతోనే మంచి జుట్టుని ఆరోగ్యకరమైన స్కాల్ఫ్ పొందడానికి ఇప్పుడు చెప్పబోయే మూడు పదార్థాలు చాలా బాగా సహాయపడుతాయి.

 మీరు వాడే షాంపూ అయినా నేరుగా తలకు అప్లై చేయకుండా దానిని కొద్దిగా నీటిలో కరిగేలా కలిపి ఆ నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. కెమికల్స్ తో నిండి ఉండే షాంపూలు నేరుగా అప్లై చేయడం వలన తలలోని జుట్టు కుదుళ్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది.  తెల్ల జుట్టు సమస్య ఎక్కువగా ఉన్నవారు మీరు వాడే ఏదైనా షాంపూలో ఉసిరికాయ రసాన్ని కలిపి తలకు అప్లై చేస్తే జుట్టు నల్లగా కుదుళ్ల నుంచి పెరగడంలో ఇది సహాయ పడుతుంది. అంతే కాకుండా జుట్టు పొడవుగా, బలంగా ఉండేందుకు సహాయపడుతుంది.

 ఉసిరికాయ తో పాటు బృంగ్రాజ్ లేదా గుంటగలగరాకు అని పిలుచుకునే ఈ ఆకు రసాన్ని షాంపూతో కలిపి అప్లై చేస్తే అనేక రకాల జుట్టు సమస్యలు అన్నీ తగ్గుతాయి. తెల్ల జుట్టు సమస్య జుట్టు చివర్లు పగలడం జుట్టు రఫ్ గా ఉండటం వంటి అనేక సమస్యలను తగ్గిస్తుంది. కొంతమందికి తలలో చుండ్రు సమస్య అధికంగా ఉంటుంది. అలాంటివారు వేపాకులను మరిగించిన మీరు లేదా వేపాకుల రసాన్ని కలిపి తలకు అప్లై చేస్తే చుండ్రు సమస్య నుంచి తొలగించుకోవచ్చు. అలాగే దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్, పేలు సమస్యలు కూడా తగ్గుతాయి.

 ఇప్పుడు చెప్పిన పదార్థాలన్నీ మన జుట్టు సమస్యలను తగ్గించి జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. అలాగే తలస్నానం చేసే ముందు కొద్దిగా గోరువెచ్చని నీటితో తలను తడపడం వలన తలలోని చర్మ కణాలు ఓపెన్ అవుతాయి. మనం అప్లై చేసిన పదార్థాలు యొక్క సారం కణాల వరకూ చేరి జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు ఈ పదార్థాలు సహకరిస్తాయి.

Leave a Comment

error: Content is protected !!